వంగవీటి రాధాకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..అసలేం జరిగిందంటే!

Illness for Vangaveeti Radha: విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వంగవీటి రంగా తర్వాత ఆయన తనయుడు వంగవీటి రాధా రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

Illness for Vangaveeti Radha: విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వంగవీటి రంగా తర్వాత ఆయన తనయుడు వంగవీటి రాధా రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

బెజవాడలో వంగవీటి రంగా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.ఆయన మరణం తర్వాత రాజకీయ వారసుడిగా వంగవీటి రాధా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతగా కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున గుండెల్లో నొప్పి రావడంతో ఊపిరి పిల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ప్రస్తుతం రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయని వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.వంగవీటి రాధాకు టెస్టులు చేసిన డాక్టర్లు గ్యాస్ స్ట్రిక్ సమస్య వల్లే ఇబ్బంది పడినట్లు తెలిపారు. అవసరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు. వంగవీటి రాధా ఆస్పత్రికి తరలించారన్న వార్త వినగానే కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూటమి నేతలు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.. అభిమానులు ఆయనను పరామర్శించారు.

Show comments