Arjun Suravaram
Andhra Pradesh: మధ్యతరగతి కుటుంబం.. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం. బీటెక్ పూర్తి చేసిన తర్వాత.. పంచాయతీ కార్యదర్శిగా ఆమెకు ఉద్యోగం వచ్చింది. అయినా సరే ఆమె అక్కడితో ఆగలేదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే పట్టుదలతో అనుకున్నది సాధించి..యువతకు స్పూర్తిగా నిలిచింది.
Andhra Pradesh: మధ్యతరగతి కుటుంబం.. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం. బీటెక్ పూర్తి చేసిన తర్వాత.. పంచాయతీ కార్యదర్శిగా ఆమెకు ఉద్యోగం వచ్చింది. అయినా సరే ఆమె అక్కడితో ఆగలేదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే పట్టుదలతో అనుకున్నది సాధించి..యువతకు స్పూర్తిగా నిలిచింది.
Arjun Suravaram
మనిషిలో సాధించాలనే పట్టుదల ఉంటే..ఏ లక్ష్యానైనా ఈజీగా చేరుకోవచ్చు. కొందరు ప్రారంభించి..మధ్యలో అపజయాలు రాగానే లక్ష్యాన్ని వదిలేస్తారు. మరికొందరు మాత్రం ఎన్ని అవరోధాలు వచ్చినా సరే.. ధైర్యంగా ఎదుర్కొంటూ చివరకు విజయం సాధిస్తారు. అలా ఎంతో మంది సామాన్య కుటుంబంలో జన్మించి..కష్టపడి చదివి విజేతలుగా నిలుస్తున్నారు. అంతేకాక ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా పంచాయతీ కార్యదర్శి నుంచి డిప్యూటీ కలెక్టర్ అయినా ఓ మహిళ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో లక్ష్మీ ప్రసన్న మధ్యతరగతి కుటుంబం. ఆమెకు చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయాలనే కోరిక ఉండేది. అందుకు కోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కనేది. లక్ష్మీ ప్రసన్న స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిని పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం తన లక్ష్య వైపు అడుగులు వేశారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదివి.. ముందు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించారు. లక్ష్మీ ప్రసన్న టీవీపురంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇదే సమయంలో తాను కలెక్టర్ కావాలని భావించింది. అందుకే ఢిల్లీలో సివిల్స్ పరీక్షలకు శిక్షణ తీసుకుంది. 2018లో నిర్వహించిన గ్రూప్-1లో మెయిన్స్‌కు లక్ష్మీ ప్రసన్న అర్హత సాధించారు. కానీ ఆమెకు త్రుటిలో గ్రూప్ 1 ఉద్యోగం చేజారింది. అయినా లక్ష్మీ ప్రసన్న నిరాశ చెందలేదు. రెట్టించిన కసితో మరోసారి ప్రయత్నానికి సిద్ధమైంది. తొలి ప్రయత్నంలో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ పట్టుదల పెంచుకుని.. గమ్యం వైపు అడుగులు వేశారు.
2023లో నిర్వహించిన గ్రూప్-1లో ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకుతో అనుకున్న సాధించారు. ప్రస్తుతం మంగళగిరిలోని హెచ్ ఆర్ డీఏలో ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ అక్టోబర్ 4తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు ఆర్డీవోగా నియమితులయ్యారు. లక్ష్మీ ప్రసన్నచంద్రదీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆయన అనంతపురం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. లక్ష్మి ప్రసన్న త్వరలోనే ఒంగోలు ఆర్డీవోగా బాధత్యలు స్వీకరించబోతున్నారు. లక్ష్మీ ప్రసన్నకు తొలి పోస్టింగ్ కీలమైన ప్రకాశం జిల్లా ఒంగోలులో రావడం విశేషం. ఈమె కష్టపడి చదివి అనుకున్నది సాధించి.. జీవితంలో ఉన్నతస్థానంలో ఉన్నారు.
ఈ యువ డిప్యూటీ కలెక్టర్ ను ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా తీసుకుని విజయాలు సాధించాలి. ఇలా చాలా మంది యువత ఎన్నో కష్టాలు అనుభవించి.. చివరకు విజయం సాధిస్తారు. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ నుంచి సివిల్స్ సాధించాడు. అన్ని సౌకర్యాలు ఉండి చదువులను నిర్లక్ష్యం చేసే వాళ్లు ఒక వైపు అయితే.. కష్టాల సంద్రాన్ని ఈదుతు చివరకు విజయం సాధించిన వారు మరోవైపు ఉన్నారు. మొత్తంగా ఈ లక్ష్మీ ప్రసన్న సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.