P Krishna
IMD Rain Alert to AP & Telangana State: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆ వివరాలు..
IMD Rain Alert to AP & Telangana State: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆ వివరాలు..
P Krishna
ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు మండిపోయాయి.. ఏప్రిల్, మే నెలలో చుక్కలు చూపించాయి. కొన్ని జిల్లాల్లో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జూన్ నెల నుంచి అనూహ్యంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. రుతు పవనాలు చురుగ్గా సాగడంతో వర్షాలు పడటం మొదలు పెట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీగానే పడింది. గత రెండు నెలల నుంచి వర్షాలు అడపాదడపా పడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో నిన్న కురిసిన కుంభవృష్టితో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రోడ్లు, కాల్వలు, డ్రైనేజీలు పొంగి పొర్లాయి.. సాయంత్రం పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. తెలంగాణలో ఈ రోజే ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.
ఇక ఏపీ విషయానికి వస్తే..పలు జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం (ఆగస్టు 17) అ్లలూరి, కృష్ణా, ఏలూరు, మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూల్, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇక నంద్యాల, అనంతపురం, విజయనగరం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, కోనసీమ, ఉభయగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.