విద్యార్థులకు అప్డేట్: పదో తరగతి ఫలితాలు అప్పుడే! ఓ కండీషన్ అప్లై!

పదో తరగతి పరీక్షలు ముగిశాయి. లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్ డేట్ ను అందించారు. రిజల్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

పదో తరగతి పరీక్షలు ముగిశాయి. లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్ డేట్ ను అందించారు. రిజల్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

విద్యార్ధి జీవితంలో పదో తరగతి టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. టెన్త్ క్లాస్ లో చూపించిన ప్రతిభ స్టూడెంట్స్ భవిష్యత్ కు ఎంతో కీలకంగా మారుతుంది. అందుకే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తూ ఉంటారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు ముగిశాయి. ఈ లోగా టెన్త్ తర్వాత ఏ కోర్సులు చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది.. తక్కువ సమయంలోనే లైఫ్ లో సెట్ అయ్యేదెలా అని ఆరా తీస్తున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు. ఇక మిగిలిందల్లా ఫలితాలు వెలువడడమే. పదో తరగతి ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్.

ఏపీలో పదో తరగతి ఫలితాలపై బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. పదో తరగతి ఫలితాలు అప్పుడే విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఆ కారణంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25నే ఫలితాలు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పరీక్ష ఫలితాల విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తప్పనిసరి. ఈ కారణంతో అనుమతులు ఆలస్యమైతే ఈ నెలాఖరుకు ఫలితాలు వెల్లడించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

పదో తరగతి పరీక్షల ఫలితాలు అనుకున్న టైమ్ కే రిలీజ్ చేసినా లేదా కాస్త ఆలస్యమైనా విద్యార్థులు భయపడాల్సిన పని లేదు. పరీక్ష ఫలితాల్లో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఏపీలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,30,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో కాస్త టెన్షన్ వాతావరణం ఉంటుందని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show comments