School Holiday: AP, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మంగళవారం కూడా విద్యాసంస్థలకు సెలవు

Heavy Rains School Holiday-Tg, AP: ఏపీ, తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే నేడు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేశారు. ఆ వివరాలు..

Heavy Rains School Holiday-Tg, AP: ఏపీ, తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే నేడు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేశారు. ఆ వివరాలు..

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వాన, వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సోమవారం నాడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఇక మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దాంతో మంగళవారం కూడా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉందా.. లేదా.. అనే అనుమానం అందరిలో నెలకొని ఉంది. పైగా పలు జిల్లాల్లో  వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్షం తగ్గినా.. వరదల వల్ల.. రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడలేదు. దాంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఆ వివరాలు..

భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యాసంస్థలకు సెలవు మంజూరుపై ఆయ జిల్లాల కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల కలెక్టర్లు.. నేడు అనగా మంగళవారం, సెప్టెంబర్ 3 నాడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ఏ జిల్లాల్లో ఈ సెలవు అమల్లో ఉందంటే..

ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు..

ఈ క్రమంలో ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా తెలంగాణలోని వరద ప్రభావం ఉన్న జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం పై ఆ జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో నేడు భారీ వర్ష ప్రభావం ఉన్న నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు, కాలేజీలకు ఆ జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ లో మాత్రం నేడు విద్యాసంస్థలకు సెలవు లేదు. విద్యార్థులు ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నారు.

Show comments