విజయవాడ హైవేపై ప్రమాదం.. మంటలు చెలరేగి కారు దగ్ధం

సంక్రాంతికి ఊరెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో విజయవాడ హైవేపై ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

సంక్రాంతికి ఊరెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో విజయవాడ హైవేపై ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగ జరుగనున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సందడి మొదలైంది. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు పండగను ఆనందంగా జరుపుకునేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వారు పండక్కి సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సంక్రాంతికి ఊరెళ్ల వారితో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సొంత వాహనాలు ఉన్నవారు కార్లు, బైక్ లపై వారి గ్రామాలకు పయనమవుతున్నారు. ఏపీకి వెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ -విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయవాడ హైవేపై ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ హైవేపో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు క్యూ కట్టాయి. అయితే పండక్కి తమ కారులో ఊరెళ్తున్న వారికి ఊహించని ఘటన ఎదురైంది. విజయవాడ హైవేపై కారు ప్రయాణిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన వారు కారును నిలిపి మంటల నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది.

చూస్తుండగానే ఆ కారులో దట్టంగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్థమైంది. కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియరాలేదు. మంటల్లో ఎవరైనా గాయపడ్డారా? కారు ప్రమాదానికి గల కారణాలు ఏంటీ అనే విషయాలు తెలియాల్సి ఉంది. పండగ సీజన్ కాబట్టి హైవేపై వాహనాల తాకిడి ఎక్కువగా ఉండడం.. కారులో మంటలు చెలరేగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments