P Krishna
Earthquake In Ichapuram: ఈ మధ్య తరుచూ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కువ శాతం ఉత్తర భారత దేశంలోనే భూకంపాలు సంభవిస్తున్నాయి.. తాజాగా శ్రీకాకుళంలో స్వల్పంగా భూమి కంపించింది.
Earthquake In Ichapuram: ఈ మధ్య తరుచూ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కువ శాతం ఉత్తర భారత దేశంలోనే భూకంపాలు సంభవిస్తున్నాయి.. తాజాగా శ్రీకాకుళంలో స్వల్పంగా భూమి కంపించింది.
P Krishna
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గత ఏడాది టర్కీ,సిరియా భూకం ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో 50 వేల మందికిపైగా కన్నుమూశారు. భారత్, ఇండోనేషియా, పాకిస్థాన్, చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో తరుచూ భూంకపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్ లో ఎక్కువగా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఏపిలో భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే.
శ్రీకాకుళం జిల్లాలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపణలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో ఇండ్లలో వస్తువులు కదలడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.మరోసారి ఉదయం 4:03 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి.. దీంతో ప్రజలు ఇండ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరినట్టు తెలియరాలేదు. అధికారులు భూప్రకంపనాలపై ఆరా తీస్తున్నారు.రెండు సంవత్సరాల క్రితం ఇదే తరహాలో భూమి కంపించిదని అధికారులు తెలిపారు. మొత్తానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.