Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

దే వ్యాప్తంగా మిచౌంగ్‌ తుఫాను ప్రభావం కనుబడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, ఏపీల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే...

దే వ్యాప్తంగా మిచౌంగ్‌ తుఫాను ప్రభావం కనుబడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, ఏపీల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే...

మిచౌంగ్‌ తుఫాను కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ భారతంలోని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్‌ కారణంగా చెన్నై వరదల్లో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా తుఫాను ప్రభావం చూపెడుతోంది. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ మిచౌంగ్‌ తుఫానుపై రెండు తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను సైతం జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో తుఫాను తీవ్రంగా ఉంది.

నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం చూపుతోంది. తూర్పుగోదావరిలోని సముద్ర తీరప్రాంతంలోకి మత్స్య కారులు గానీ, పిక్నిక్‌ వెళ్లే వారు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ బీచ్‌లలో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావం కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. దాదాపు 150 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్‌లో గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌ హెచ్చరిక జారీ అయింది.

తుఫాను సందర్భంగా ఇచ్చే కలర్‌ కోడ్‌కు అర్థం ఏంటి?

సాధారణంగా తుఫాన్లు కానీ, వర్షాలు పడుతున్నపుడు లేదా పడే అవకాశం ఉన్నపుడు వాతావరణ శాఖలు కొన్ని కలర్‌ అలెర్ట్‌లు ఇస్తూ ఉంటాయి. ప్రమాద సూచనలను రంగులతో అలెర్ట్‌ చేస్తూ ఉంటాయి. ఇంతకూ గ్రీన్‌, ఎల్లో, ఆరెంజ్‌, రెడ్‌ ఏ సందర్భాల్లో జారీ చేస్తారంటే..

  • గ్రీన్‌ : అంతా బాగానే ఉంది. ఎలాంటి సూచనలు లేవు.
  • ఎల్లో : వాతావారణంలో తీవ్ర మార్పుల కారణంగా దైనందిన పనులకు ఆటంకం కలుగుతున్నపుడు ఎల్లో అలెర్ట్‌ జారీ చేస్తారు.
  • ఆరెంజ్‌, యాంబెర్‌ : రోడ్డు, రైలు, కరెంట్‌ వంటి వాటికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
  • రెడ్‌ : వాతావరణం దారుణంగా మారి ప్రజల ప్రాణాలకే ముప్పు ఉన్నపుడు.

తుఫాన్‌ టైంలో ఈ తప్పులు మీ ప్రాణాలకే ముప్పు!

తుఫాను సమయంలో ప్రజలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఏం చేయాలో.. ఏం చేయకూడదో తప్పకుండా తెలిసి ఉండాలి. అప్పుడే మనతో పాటు మన వాళ్లు కూడా సురక్షితంగా ఉండగలరు.

తుఫాను సమయంలో చేయాల్సిన పనులు :

  • ఇంట్లోనే ఉండాలి. అత్యంత అవసరం అయితేనే తప్ప బయటకు రాకూడదు.
  • ఇంట్లోని డోర్లు, కిటికీలు సరిగా ఉన్నాయా? లేదా? చెక్‌ చేసుకోవాలి.
  • ప్లాష్‌ లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ముందుగానే ఛార్జ్‌ చేసి పక్కకు పెట్టుకోండి.
  • ఆహారం, నీళ్లు భద్రపరుచుకోండి.
  • మీరు వాహనాల్లో ఎక్కడికైనా బయటకు వెళ్లాలనుకుంటే.. అతి జాగ్రత్తగా వెళ్లండి.
  • వర్షం పడుతున్నపుడు టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువులు ఆఫ్‌లో ఉంచటం ఉత్తమం.

తుఫాను సమయంలో చేయకూడని పనులు :

  • రూమర్స్‌ను నమ్మి మోసపోకండి.
  • రెస్క్యూ సిబ్బంది వచ్చే వరకు బయటకు వెళ్లకండి.
  • ఓ సురిక్షతమైన ప్రదేశంలో ఉండండి.. అక్కడినుంచి పక్కకు రాకండి.
  • కరెంట్‌ వైర్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో లూజ్‌ కనెక్షన్‌ ఉంటే వాటి వైపు వెళ్లకండి.
  • తప్పుడు వార్తలను సైతం ప్రచారం చేయకండి.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ‍ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి సీఎం జగన్‌ దిశా నిర్థేశం చేశారు. యుద్ద ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు గ్రౌండ్‌ లెవెల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటున్నారు. తుఫాన్ వల్ల  ఏవైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా డయల్‌ 100కు, ప్రత్యేక పోలీసు కంట్రోల్‌ రూం 8688831568కు సమాచారం అందిస్తే.. అధికారులు సహాయక చర్యలు చేపట్టనున్నారు.

కృష్ణాజిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు

08672 252572
08672 252000

  • శ్రీకాళహస్తి: 97041 61120
  • సూళ్లూరుపేట: 94907 39223
  • గూడూరు: 08624- 252807
  • తిరుపతి: 94910 77012

మరి, దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న మిచౌంగ్‌ తుఫానుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments