దసర పండుగ బంపర్ ఆఫర్.. రూ.3‌లకే బిర్యానీ..ఎగబడుతున్న జనాలు!

Biryani Offer: బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండారు. ఇటీవల రెస్టారెంట్స్ లో ఎన్నో రకాల బిర్యానీ వెరైటీలు భోజన ప్రియులకు అందిస్తున్నారు. ఇక కొత్తగా ప్రారంభించే రెస్టారెంట్స్ క్రేజీ ఆఫర్ ప్రకటిస్తున్నారు.

Biryani Offer: బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండారు. ఇటీవల రెస్టారెంట్స్ లో ఎన్నో రకాల బిర్యానీ వెరైటీలు భోజన ప్రియులకు అందిస్తున్నారు. ఇక కొత్తగా ప్రారంభించే రెస్టారెంట్స్ క్రేజీ ఆఫర్ ప్రకటిస్తున్నారు.

ఇటీవల కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్స్ లో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో ప్రారంభించే హూటల్స్, రెస్టారెంట్స్ ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా హూటల్‌లో టీ 10 రూపాయలు, సమోసా 15 రూపాయలు. అలాంటింది మూడు రూపాయలకే బిర్యానీ. అది కూడా తిన్నోళ్లకు తిన్నంత. మీరు వింటుందిన నిజమే.. మూడు రూపాయలకు సింగిల్ బ్రెడ్​ రాదు.. బిర్యానీ ఏంటీ? అని ఆశ్చర్యపోతున్నారా? వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఇది నిజం. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ? ఎందుకు ఈ బంపర్ ఆఫర్ పెట్టారు? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.. బిర్యానీ పేరు చెబితే లొట్టలేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంటారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కొత్తగా ప్రారంభించిన అన్ లిమిటెడ్ రెస్టారెంట్ లో కేవలం రూ.3 లకే బిర్యానీ ఆఫర్ పెట్టారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమడోలులో అన్‌లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లను ఉన్నాయి. వ్యాపారాభివృద్దిలో భాగంగా జంగారెడ్డి గూడెంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది యాజమాన్యం. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భోజన ప్రియులకు కన్నులు చెదిరే బంపర్ ఆఫర్ ప్రకటించారు రెస్టారెంట్ నిర్వహకుడు. కేవలం రూ.3 చెల్లిస్తే తిన్నంత బిర్యానీ.వారం రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిసిటీ చేశారు.

బిర్యానీ ఆఫర్ అనగానే అనుకున్న దానికన్నా ఎక్కువ జనాలు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెస్టారెంట్ బయట యాజమాన్యం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని షరతు పెట్టారు. కస్టమర్లు క్యూ లైన్లో వచ్చి రూ.3 చెల్లించి బిర్యానీ ప్యాకెట్ తీసుకువెళ్లారు. క్యూ లైన్లో తోపులాట, ఘర్షణలు జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కేవలం మూడు గంటలే ఈ బంపర్ ఆఫర్ ఉండటంతో వేల మంది అక్కడికి వచ్చారు. టైమ్ ముగిసిన తర్వాత చాలా మంది నిరాశతో వెనుదిరిగిపోయారు. దాదాపు ఈ ఆఫర్ 5 వేల మంది వినియోగించుకున్నట్లు రెస్టారెంట్ యాజమాన్యం తెలిపారు.

Show comments