CM జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ అప్డేట్.. నిందితుడి గుర్తింపు

Attack On CM Jagan Case: ఏపీ సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..

Attack On CM Jagan Case: ఏపీ సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జగన్ విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా.. ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల నేతలు, సీఎంలు, సినీ సెలబ్రెటీలు ఈ దాడిని ఖండించారు. సీఎం జగన్ పై దాడి జరగడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి.. దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాాజాగా కేసులో బిగ్ అప్డేట్ చోటు చేసుకుంది. సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఆ వివరాలు..

విజయవాడలో సీఎం జగన్ మీద దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తి అని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫుట్ ఫాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయిని జేబులో వేసుకుని వచ్చి.. దాడి చేశాడని పోలీసులు చెప్పుకొచ్చారు.

మీటింగ్ కు వచ్చిన సతీష్.. ఉన్నట్లుండి జగన్ పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. దాడి చేసే సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్ ను అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు.

సీఎం జగన్ పై దాడికి సంబంధించి విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో పోలీస్ అధికారులు దర్యాప్తు జరిపారు. కేసును వేగంగా దర్యాప్తు చేయడం కోసం సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో దాడి చేసిన దుండగుల వివరాలను కనుక్కునేందుకు పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు.  దుండగుల వివరాలు చెప్పినవారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. ఇక నేడు జగన్ మీద దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show comments