Dharani
జగన్ పై జరిగిన రాయి దాడిని ఖండిస్తూ.. ఇది టీడీపీ పనే అంటూ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
జగన్ పై జరిగిన రాయి దాడిని ఖండిస్తూ.. ఇది టీడీపీ పనే అంటూ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోండటంతో.. సీఎం జగన్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. శనివారం నాటికి ఈ యాత్ర 14 రోజులు పూర్తి చేసుకుంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ విజయవాడ చేరుకున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. దుండగులు.. రాయితో జగన్ పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన వైద్యులు.. ఆయనకు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు. దాడిపై మోదీ, కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ దాడిపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది టీడీపీ పనే అంటున్నారు. ఈ క్రమంలో మంత్రిపెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
జగన్ పై దాడి నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ’’ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో వస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఆయనపై ఈ దాడి చేశారు. నారా లోకేష్ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని అర్థం అవుతోంది. జగన్ పై జరిగిన దాడి టీడీపీ పనే‘‘ అన్నారు పెద్దిరెడ్డి
’’జగన్ చేపట్టిన సిద్ధం సభలు, బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి అందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌కు ఉన్న ఆదరణను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. దాడిపై స్పందిస్తూ.. నారా లోకేష్ ట్విట్టర్‌లో.. 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టం అవుతోంది‘‘ అన్నారు పెద్దిరెడ్డి.
అంతేకాక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ’’ఎవరైనా కావాలనే రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా. అదే రాయిని లోకేష్‌కు ఇస్తాం. జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలోనే లోకేష్ కూడా బస్సు ఎక్కి ఎవరితో అయినా రాయితో కొట్టించాలి. అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యమవుతుందో లేదో అర్థం అవుతుంది. ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గతంలో జగన్ పాదయాత్ర చేసే సమయంలో గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోంది అన్నారు. కృష్ణా జిల్లా ఇంచార్జీగా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం. మళ్ళీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో జనాదరణ రావడంతో ఈ కుట్రకు తెర లేపారు’‘ అని పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు..