iDreamPost

హోంగార్డ్‌పై దాడి: అతడు ఆ మాట అన్నాడు.. అందుకే సీరియస్ అయ్యా: సౌమ్య జాను

  • Published Feb 28, 2024 | 9:22 AMUpdated Feb 28, 2024 | 3:45 PM

సినీ ఇండస్ట్రీలోని సెలబ్రీటిస్ తరుచు ఎదో వివాదంలో నిలుస్తునే ఉంటారని సంగతి తెలిసిందే. అయితే తాజగా ఓ సిని నటి కూడా ఒక వివాదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈమె పేరు తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలోని సెలబ్రీటిస్ తరుచు ఎదో వివాదంలో నిలుస్తునే ఉంటారని సంగతి తెలిసిందే. అయితే తాజగా ఓ సిని నటి కూడా ఒక వివాదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈమె పేరు తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 28, 2024 | 9:22 AMUpdated Feb 28, 2024 | 3:45 PM
హోంగార్డ్‌పై దాడి: అతడు ఆ మాట అన్నాడు.. అందుకే సీరియస్ అయ్యా: సౌమ్య జాను

సినీ ఇండస్ట్రీలోని సెలబ్రీటిస్ తరుచు ఎదో ఒక వివాదంలో నిలుస్తునే ఉంటారు. అది పబ్లిక్ లో గానీ, సోషల్ మీడియాలోగానీ ఏదో ఒక రూపంలో వివాదాలు చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే భారీ ఎత్తున విమర్శలు కూడా వెంటాడతాయి. దీంతో అప్పటి వరకు ఉన్న ఫేమ్ కాస్త పోతుంది. అసలు వారు సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ అయిన పబ్లిక్ లో తిరిగినప్పుడు మాత్రం వాళ్లు సామాన్య మనుషులే. అందుచేత సామాన్య ప్రజలకు బయట ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో, సెలబ్రీటీస్ కూడా అవి పాటించక తప్పదు. కానీ, ఇండస్ట్రీలో తాజాగా ఓ నటి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. నగరంలోని ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించడమే కాకుండా.. ఏకంగా ట్రాఫిక్ హోంగార్డు పై దురుసుగా ప్రవర్తించి దాడి చేసింది. ఇంతకి ఆ నటి ఎవరంటే..

ఇటీవలే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12లో అగ్రసేన్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు పై జాగ్వార్ కారులో.. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ యువతి చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. అలా రాంగ్ రూట్ లో రావడమే కాకుండా.. ఆ ట్రాఫిక్ హోంగార్డు పై దురుసుగా ప్రవర్తిస్తూ.. అతడి పై దాడికి పాల్పడింది. దీంతో పోలీసులు సదరు యువతి పై కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదానికి కారణమైన సదరు యువతి సినీ నటి సౌమ్య జాను గా బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా అందుబాటులో లేదని తెలిపారు. కాగా, ఆమె సెల్ ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే ఆమె పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్టు కూడా తెలిపారు.

అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత సౌమ్య జాను ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందన్నది సౌమ్య మొత్తం వివరించింది. ఈ క్రమంలోనే తాను అత్యవసర పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వెళ్లనని అంగీకరించింది. అయితే, తాను అలా రాంగ్ రూట్‌లో వెళ్లడానికి కారణం.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో మందుల కోసమని అలా వెళ్లాల్సి వచ్చిందని వివరించింది. ఇదే విషయం ఆ హోంగార్డుకు కూడా చెప్పానని.. కానీ ఆయన వినిపించుకోకుండా అమర్యాదగా మాట్లాడమే కాకుండా.. అసభ్యంగా తిట్టాడని ఆరోపించింది. అందుకే తాను అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని చెప్పింది. ఓ ఆడపిల్లని అలా అసభ్యంగా తిట్టవచ్చా అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకుంది.

అలాగే హోం గార్డు సెల్‌ఫోన్ పగలగొట్టడం, దుస్తులు చించేయడం అంతా అబద్దమని చెప్పుకొచ్చింది. పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే అసలు ఎవరిది తప్పో తెలుస్తుందని సౌమ్య జాను పేర్కొంది. తన లాంటి సెలెబ్రిటీనే ఇలా అంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఇక తాను కూడా హోంగార్డు మీద కేసు పెట్టనున్నట్టు చెప్పుకొచ్చింది. మరి, సిని నటి సౌమ్య హోంగార్డు మధ్య జరిగిన వివాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి