iDreamPost

ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన వారికి కూడా ఛాన్సులు రాలేదు: హిమజ

Himaja On Film Chances: తెలుగు నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హిమజ ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలు, కమిట్మెంట్ గురించి కూడా ఓపెన్ కామెంట్స్ చేసింది.

Himaja On Film Chances: తెలుగు నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హిమజ ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలు, కమిట్మెంట్ గురించి కూడా ఓపెన్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన వారికి కూడా ఛాన్సులు రాలేదు: హిమజ

ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటి నుంచో చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. అదేంటంటే.. అవకాశాలు రావాలి అంటే ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయి. ఇలాంటి ఎన్నో కామెంట్స్, అభిప్రాయాలు, ప్రచారాలను వినే ఉంటారు. అయితే బయటి నుంచి వినే వారికి దేని గురించి సరైన అవగాహన ఉండదు. కానీ, ఇండస్ట్రీలో ఉన్న వారికి.. ఇప్పటికే ఇండస్ట్రీలో పని చేసిన వారికి దానిపై కరెక్ట్ అభిప్రాయం, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే కామెంట్స్ కి కూడా తెలుగు నటి హిమజ సూటిగా సమాధానాలు చెప్పింది.

హిమజ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి సంబంధించి వచ్చే వ్యాఖ్యలు, వినిపించే ప్రచారాల గురించి సూటిగా స్పందించింది. యాంకర్ హిమజను.. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే అవకాశాలు రావడం లేదా అని ప్రశ్నించగా.. “తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉండరు అనే విషయం ఇప్పటికే రుజువు అయ్యింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన అందరికీ అవకాశాలు రాలేదు. అవకాశాలు వచ్చిన అందరూ కమిట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు వస్తున్నాయి అంటే లోపం ఎక్కడుంతే చెప్పలేం కదా.

ఎవరు వెళ్లారు? ఏంటో మనం ఎంక్వైర్ చేయలేం కదా. ఇంకొకటి అత్యాస వల్ల కూడా అవకాశాలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. అంటే వచ్చిన పాత్రతో కాకుండా.. హీరోయినే కావాలి అని వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. నేను సీరియల్స్ చేసే టైమ్ లో కొంచెం ఇష్టం కొంచం కష్టం సీరియల్ కి వరుసగా రెండేళ్లు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నాను. ఆ సమయంలో నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఒక పని మనిషి పాత్ర నాకు వచ్చింది. నేను చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే తెలుగులో హిమజా అనే ఒక అమ్మాయి ఉంది అని తెలిసేలా చేయాలి అనుకున్నాను.

వచ్చిన పాత్రలో నా టాలెంట్ చూపించాలి అని అనుకున్నాను. ఆ తర్వాత నాకు అవకాశాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. స్వయంవరం, భార్యామణి, కొంచం ఇష్టం కొంచం కష్టం మూడు సీరియల్స్ లో లీడ్ రోల్ చేశాను. ఇలా పని మనిషి పాత్ర అనగానే చాలా మంది రిసీవ్ చేసుకోలేకపోయారు. అది వాళ్ల సమస్య.. కానీ, మా ఇంట్లో వాళ్లు మాత్రం రిసీవ్ చేసుకున్నారు. ఏదైనా యాక్టింగ్ ని యాక్టింగా చూస్తే బాగుంటుంది. ఆర్టిస్ట్ అంటే ఆ పాత్రలో నటించడం. నేను ఏమైనా నిజంగా పని మనిషిగా చేస్తే ఫీలైనా అర్థం ఉంది” అంటూ హిమజ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి