iDreamPost

ఘనంగా ‘తెలుగింటి సంస్కృతి’ సక్సెస్‌ వేడుకలు

  • Published Oct 08, 2023 | 12:33 PMUpdated Oct 09, 2023 | 10:41 AM
  • Published Oct 08, 2023 | 12:33 PMUpdated Oct 09, 2023 | 10:41 AM
ఘనంగా ‘తెలుగింటి సంస్కృతి’ సక్సెస్‌ వేడుకలు

కేఆర్‌ఆర్‌ వర్క్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇటీవలె విడుదలైన ‘తెలుగింటి సంస్కృతి’ మ్యూజిక్‌ వీడియో సోషల్‌ మీడియాలో సెన్సెషన్‌ సృష్టిస్తూ వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో వన్‌ మిలియన్‌ వ్యూస్‌ సాధించడంతో.. ఆ వీడియో టీమ్‌ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో సాంగ్‌కు నిర్మాతగా వ్యవహరించిన రాధా కృష్ణ హారతి.. సాంగ్‌ డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సాంగ్‌లో ప్రశాంతి హారతి లీడ్‌గా చేశారు. ప్రశాంతి.. “పెళ్లాం ఊరెళితే”, “ఇంద్ర” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.

ఈ తెలుగింటి సంస్కృతి పాటకు ఆమె కొరియోగ్రఫీ చేయడం విశేషం. చిన్నతనం నుంచి తన తల్లి నుంచి కూచిపూడి నృత్య కళను నేర్చుకుని ఆమె కుమార్తె తాన్యా హారతి సైతం ఆ పాటలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే సాంగ్‌ తాన్యా హారతి తండ్రిగా కిరణ్ గుడిపల్లి సైతం మెప్పించారు. ఇక ఈ పాటకు కెమెరామెన్లుగా శ్యామ్ కట్రు, పృథ్వీ తేజ, కమల్ నందికొండ పనిచేశారు. ఈ విజయోత్సవ వేడుకలుకు ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గోపాల్ పొనంగి ముఖ్య అతిథిగా హాజరై.. టీమ్‌కు అభినందనలను తెలియజేశారు. మరి కిందున్న ‘తెలుగింటి సంస్కృతి’ వీడియో సాంగ్‌ను మీరూ చూసి, ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు కోసం RRR ఫార్ములా! అలా వాడుకున్నారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి