iDreamPost

టీడీపీకి మరో షాక్.. బీఆర్ఎస్ లోకి కాసాని?

  • Published Oct 27, 2023 | 12:56 PMUpdated Oct 27, 2023 | 12:56 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వలసల పర్వం కొనసాగుతుంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రధాన పార్టీల్లో సందడి మొదలైంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వలసల పర్వం కొనసాగుతుంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రధాన పార్టీల్లో సందడి మొదలైంది.

  • Published Oct 27, 2023 | 12:56 PMUpdated Oct 27, 2023 | 12:56 PM
టీడీపీకి మరో షాక్.. బీఆర్ఎస్ లోకి కాసాని?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే అసంతృప్తి నేతలు ఏ క్షణంలో ఏ పార్టీలకి జంప్ అవుతారో తెలియని అయోమయం నెలకొంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రధాన పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీపై అలిగిన కొంతమంది కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకుంటే.. తమకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీ నాయకులు బీఆర్ఎస్ కండువ కప్పుకుంటున్నారు. సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు జంపింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి తెలంగాణలో రాజకీయం మూడు ముక్కలాటగా మారిపోయింది. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రోజు రోజుకీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హూరా హూరీ యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఙానేశ్వర్ సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొంత కాలంగా తెలంగాణలో టీడీపీ సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇక్కడ సరైన కేడర్ లేదు.. మరోవైపు ఏపిలో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఇప్పటికీ బెయిల్ కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇక ఏపిలో టీడీపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ లో టీడీపీ పోటీ చేసి గెలవడం అనేది కష్టమైన పని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాసాని టీడీపీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి రాబోతున్నారని.. ఒకటీ రెండు రోజుల్లో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకుంటారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

మొన్నటి వరకు తెలంగాణలో 89 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని తెలంగాణలో తాము పోచే చేయడం లేదంటూ టీడీపీ యువనేత లోకేష్ పేరుతో ఒక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ టీడీపీకి పూర్వ వైభవం తేవాలని అనుకున్న తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఒక్కసారే నిరాశలోకి వెళ్లిపోయారు. తెలంగాణలో తాము గెలిచే స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమైనప్పటికీ చంద్రబాబు ఇక్కడ పోటీ చేయడంపై విముఖత చూపించడం.. పరోక్షంగా కాంగ్రెస్ కు టీడీపీ సహకరిస్తుందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఇది సరైన పద్దతి కాదని.. అందువల్లే పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని మీడియాల్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గంపై బీఆర్ఎస్ కన్నేసింది. ఇటీవల పటాన్ చెరు టికెట్ ఆశించి భంగపడ్డ ముదిరాజ్ కీలక నేత నీలం మధు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు యాభై లక్షల ఓట్లు ఉన్న తమకు అధికార పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించడం లేదని ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తుంది. కొన్ని సభలకు ఈటెల రాజేందర్ హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం బీఆర్ఎస్ ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి గతంలో పెద్ద దిక్కుగా చెప్పుకున్న కాసానిని పార్టీలో చేర్చుకుంటే కొంతవరకు ముదిరాజ్ ఓట్లు తమవైపు తిప్పుపకోవచ్చు అని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి