iDreamPost

సుపరిపాలనకు అనుభవం అక్కర్లేదా..?

సుపరిపాలనకు అనుభవం అక్కర్లేదా..?

ప్రజలకు మంచి చేస్తూ.. వారి జీవన ప్రమాణాలను పెంచే బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలది. పరిపాలనా అనుభవం ఉన్న పాలకులు ఆ ప్రభుత్వాలను నడిపితేనే ప్రజలకు మంచి జరుగుతుందా..? అనుభవం లేకపోయినా మంచి చేయాలనే తపన పాలకుడికి ఉంటే సరిపోతుందా..? అంటే.. రెండో ఆప్షనే కరెక్ట్‌ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరూపిస్తున్నారు. ఎలాంటి పరిపాలనా అనుభవం లేకపోయినా.. వినూత్నమైన విధానాలు, పథకాలు, కార్యక్రమాలతో వైఎస్‌ జగన్‌.. దేశంలోనే సీనియర్‌ ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలలో అమలు చేస్తుండడం యువ ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రైతే రాజు అనే నానుడిని నిజం చేసేలా 7 దశాబ్ధాల స్వతంత్ర భారతంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అన్నదాతలకు అండగా ఉండేందుకు వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కేంద్రాలు ఈ ఏడాది జూన్‌ నుంచి అందుబాటులోకి వచ్చాయి. గ్రామ సచివాలయాల్లో ఉండే వ్యవసాయ సహాయకులు ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, పంట బీమా, సలహాలు, సమాచారం.. అంతా అందజేస్తూ రైతన్నలకు ప్రభుత్వం ఉందనే భరోసాను ఇస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలుగా కూడా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ.. రైతుల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి.

జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల మాదిరిగానే.. తెలంగాణ రాష్ట్రం కూడా రైతు వేదిక పేరిటి అన్నదాతలకు అండగా ఉండే కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు.. సమీపంలోని గ్రామంలో ఈ రైతు వేదికలను ఏర్పాటు చేస్తోంది. రైతులను అనుసంధానం చేయడం, ఏ పంటలు వేయాలి, గిట్టుబాటు ధరలు, సలహాలు, సూచనలు.. వంటి సేవలు ఈ రైతు వేదికల్లో లభించనున్నాయి. ఐదే వేల ఎకరాలకు ఒకరు చొప్పన పని చేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారి రైతు వేదిక కేంద్రంలో అందుబాటులో ఉంటారు. రైతుల తమ కష్టనష్టాలను ఈ వేదికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి ఉంచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. నిర్మాణం పూర్తయిన తొలి వేదికను ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్‌ జనగామ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి