iDreamPost

వెబ్‌సైట్ లో టెన్త్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

పదో తరగతి విద్యార్థులు కొన్ని రోజుల్లో తమ భవిష్యత్తుకు బాటలు వేసే పరీక్షలకు హాజరవబోతున్నారు. టెన్త్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పుడే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.

పదో తరగతి విద్యార్థులు కొన్ని రోజుల్లో తమ భవిష్యత్తుకు బాటలు వేసే పరీక్షలకు హాజరవబోతున్నారు. టెన్త్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పుడే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.

వెబ్‌సైట్ లో టెన్త్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇదివరకే పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన అధికారులు పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్ క్లాస్ ప్రతి విద్యార్థికి జీవితాన్ని మలుపు తిప్పే దశ. కాబట్టి విద్యార్థులు పదోతరగతిలో మంచి గ్రేడ్ సాధించేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరోవైపు మంచి ఫలితాలను రాబట్టేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు మార్చి 18న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీన ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 7న విడుదల చేశారు. విద్యార్థులు నేరుగా https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు?

టెన్త్ హాల్ టికెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి:

  • పరీక్షలకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • అక్కడ మీకు మెయిన్ పేజీలో SSC Public Examinations March 2024 Hall Tickets అనే లింక్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో దానిపై క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత రెగ్యూలర్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్, ప్రైవేట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్, ఓఎస్ఎస్సీ హాల్ టికెట్స్ డౌన్ లోడ్, ఒకేషనల్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ వివరాలు అనగా.. జిల్లా, స్కూల్, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు నమోదు చేసి డౌల్ లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు టెన్త్ హాల్ టికెట్ కనిపిస్తుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే అప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను స్కూళ్లకు పంపించింది. ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంచింది. విద్యార్థులకు ఎలా సౌకర్యంగా ఉంటే ఆ విధంగా హాల్ టికెట్ ను పొందొచ్చు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 5,08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్

  • మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
  • మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
  • మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
  • మార్చి 23- మ్యాథమెటిక్స్
  • మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
  • మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
  • మార్చి 30- సోషల్ స్టడీస్
  • ఏప్రిల్ 1- ఒకేషనల్‌ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్‌)‌,
  • ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్‌)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి