iDreamPost

రేషన్‌ కార్డుదారులకు అలర్ట్‌.. మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది

  • Published Feb 26, 2024 | 2:01 PMUpdated Feb 26, 2024 | 2:01 PM

Ration Card e-KYC : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ హోల్డర్స్ కు ప్రభుత్వం ఓ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. దీనితో అప్రమత్తమైన ప్రజలు రేషన్ షాప్ వద్దకు పరుగులు తీస్తున్నారు.

Ration Card e-KYC : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ హోల్డర్స్ కు ప్రభుత్వం ఓ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. దీనితో అప్రమత్తమైన ప్రజలు రేషన్ షాప్ వద్దకు పరుగులు తీస్తున్నారు.

  • Published Feb 26, 2024 | 2:01 PMUpdated Feb 26, 2024 | 2:01 PM
రేషన్‌ కార్డుదారులకు అలర్ట్‌.. మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీటితో పాటు రాష్ట్రం లో రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు కూడా సిద్ధమైయింది. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రం తెలంగాణ సర్కార్ కీలక సూచనలు చేసింది. ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు కలిగివున్నారో వారందరికి ఈ కేవైసీ అప్ డేట్ చేయుంచుకోమని ప్రకటన చేసింది. ఇక ఈ-కేవైసీ అప్ డేట్ చేయకుంటేరేషన్ కట్ అవుతుందని ఇటీవలే పౌర సరఫరాలశాఖ కమిషనర్ నుంచి అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు అందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఓ బిగ్ అలర్ట్ ను జారీ చేసింది.

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఇతర ప్రయోజనాలు అందుకోవాలన్నా రేషన్ కార్డు కీలకంగా మారింది. మరి అలాంటి పథాకాలను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతిఒక్కరికి రేషన్ కార్డ్ అవసరం. అయితే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. కానీ, వీరిలో చాలా మంది ఇప్పటికీ ఈ-కేవైసీ చేయించుకోలేదు. అలాంటి వారందరికి రేషన్ కార్డ్ ఈ-కేవైసీ అప్ డేట్ చేయించుకోమని ప్రభుత్వం జారీ చేయండంతో పాటు.. ముందుగా జనవరి 31 వరకు గడువును ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఆ గడువును కాస్త ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడించారు. దీంతో రేషన్ కార్డు హోల్డర్స్ ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే త్వరగా ఈ నెల 29వ తేది లోపు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని కనుక మరో రెండు రోజుల్లో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డుల ఈ-కేవైసీ 85 శాతం మేరకు పూర్తయినట్లు సమాచారం తెలుస్తోంది. కానీ ఇది ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌.. అన్ని జిల్లాల కలెక్టర్లు , అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇక రేషన్‌కార్డులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ-కేవైసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లబ్ధిదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్లటం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండటంతోనే ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టింది. అందుచేతనే రేషన్ కార్డులో పేర్లున్న వారంతా.. తమ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వారి పేర్లను రేషన్ కార్డుల్లో కొనసాగిస్తారని, లేదంటే తొలగిస్తారని ప్రభుత్వం పేర్కొంది. మరి, తెలంగాణ రేషన్ కార్డు హోల్డర్స్ మరో రెండు రోజుల్లో ఈ-కేవైసీ అప్ డేట్ గడువు ముగస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి