iDreamPost

బ్రేకింగ్: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు

బ్రేకింగ్: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు

తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దైంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనలను హైకోర్టు స్వీకరించింది. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. అంతేకాక పరీక్షలను మళ్లీ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీని ఆదేశించింది. జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.  తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్  పరీక్ష  జరిగింది.

గ్రూప్-1  పరీక్షలు అనేవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. రాష్ట్ర స్థాయిలో ఆర్టీవో, డీఎస్పీ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ఈ గ్రూప్-1 పరీక్షలను నిర్వహిస్తుంటారు. ప్రతి రాష్ట్రం ఈ పరీక్షలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంటుంది. అయితే తెలంగాణలో  గ్రూప్-1 పరీక్షలు విమర్శలకు తావిస్తోంది. గతంలో టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారం కారణంగా గ్రూప్-1 పరీక్షలు వాయిదా పడ్డాయి.  అనంతరం పక్బంధీగా పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్ పీఎస్సీ తెలిపింది. ఈ క్రమంలోనే జూన్11న గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించారు. అయితే  ఆ సమయంలో బయోమెట్రిక్ లేకుండానే పరీక్షలకు అనుమతించారు. ఈ అంశంపై పలువురు విద్యార్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన కోర్టు..విచారణ జరిపి.. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. దీంతో మరోసారి గ్రూప్-1 పరీక్ష రద్దు కావడంతో టీఎస్ పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పట్ల ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరి.. మరోసారి తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి