iDreamPost

మైనార్టీలకు శుభవార్త.. రూ.1 లక్ష ఆర్థిక సహాయం!

మైనార్టీలకు శుభవార్త.. రూ.1 లక్ష ఆర్థిక సహాయం!

ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెట్టాయి. అలానే వివిధ రూపాల్లో వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తుంటాయి. ఏపీ ప్రభుత్వం తరచూ పలు స్కీమ్ ల పేరుతో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారీకి ఆర్థిక సాయం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం చేస్తుంటారు. అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన.. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తరచూ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పే కేసీఆర్.. ఈ సారీ మైనార్టీలు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి రూ.1లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు.

జులై 15వ తేదీ నుండి బీసీలకు లక్ష రూపాయాల ఆర్ధిక సహాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీసీ సామాజిక వర్గానికి చెందిన కుల వృత్తులకు వారికి రూ. లక్ష ఆర్ధిక సహాయంగా అందిస్తుంది. ఈ ఏడాది జూన్ 20వ తేదీ నుండి ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. తాజాగా బీసీల మాదిరిగానే మైనార్టీలకు కూడా రూ.1 లక్ష ఆర్ధిక సహాయం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం దోహదపడనుందని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టుగా సీఎం కేసీఆర్ అన్నారు.

ఇప్పటికే వివిధ వర్గాల పేదలకు ప్రభుత్వం భరోసాను కల్పిస్తుందని సీఎం చెప్పారు. మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో అనేక పథకాలు అమలు చేస్తూ మైనార్టీల్లో పేదరికం, వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రకలా చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు సమానంగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది.

షాదీ ముబారక్, విదేశీ విద్యా కింద రూ.20 లక్షలు, రంజాన్ కానుకలు,అజ్మీర్ లో రూ.5 కోట్లతో అతిథి గృహం నిర్మిస్తున్నారు. మైనారిటీల అభివృద్ధికి ఈ పథకం దోహద పడనుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. మరి..కేసీఆర్ తీసుకొచ్చిన ఈ ఆర్థిక సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దివ్యాంగులకు రూ.4 వేలు పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి