iDreamPost

దివ్యాంగులకు రూ.4 వేలు పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

దివ్యాంగులకు రూ.4 వేలు పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను అమలు చేస్తుంటాయి. అలానే వృద్ధులకు, వింతతువులకు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్లు అందిస్తుంటాయి. అయితే రాష్ట్రాలను బట్టి పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందుతుంది. తరచూ ప్రభుత్వాలు కూడా పెన్షన్లు పెంచుతూ ఉంటాయి. ఏపీ ప్రభుత్వం తరచూ పింఛన్లు పెంచుకుంటూ వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా దివ్వాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  ఇప్పటి వరకు వారికి  ఇస్తున్న పింఛన్ ను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి వరకు దివ్వాంగులకు  ఆసరా పింఛన్  రూ.3000ను టీఎస్ ప్రభుత్వం అందిస్తుంది. అయితే తాజాగా ఈ ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే పెరిగిన పెన్షన్‌ను జులై నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీని ద్వారా 5.20 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఇటీవల ఓ బహిరంగ సభలో  సీఎం కేసీఆర్ పింఛన్ల పెంపుపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన సమావేశంలో పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. మరి.. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి