iDreamPost

బిగ్‌ ఫైట్‌కు సిద్ధమైన షారుఖ్ ఖాన్‌, ప్రభాస్‌! గెలుపెవరిది?

  • Published Jul 04, 2023 | 12:08 PMUpdated Jul 04, 2023 | 12:08 PM
  • Published Jul 04, 2023 | 12:08 PMUpdated Jul 04, 2023 | 12:08 PM
బిగ్‌ ఫైట్‌కు సిద్ధమైన షారుఖ్ ఖాన్‌, ప్రభాస్‌! గెలుపెవరిది?

షారుఖ్‌ ఖాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా. సౌత్‌ సినిమాల దెబ్బకు కుదేలైపోయిన హిందీ సినిమాకు ‘పఠాన్‌’తో ప్రాణం పోశాడు. తన కెరీర్‌లోనే పఠాన్‌ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేసిందా సినిమా. అదే ఊపును కొనసాగిస్తూ మరోసారి భారీ హిట్‌ కొట్టేందుకు ‘జవాన్‌’ సినిమాతో సిద్ధమవుతున్నాడు షారుఖ్‌. ఆ సినిమా టీజర్‌ను ఈ నెల 7న రిలీజ్‌ చేసేందుకు జవాన్‌ మూవీ యూనిట్‌ ప్లాన్ చేస్తోంది.

అయితే.. అంతకంటే ఒక్కరోజు ముందు అంటే దాదాపు కొన్ని గంటల ముందుగానే పాన్‌ ఇండియా స్టార్‌, సౌత్‌ సినిమాను దేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ మూవీ టీజర్‌ విడుదల కానుంది. ఆదిపురుష్‌ సినిమా నిరాశపర్చినా.. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబోలో వస్తున్న సలార్‌పై సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే.. ఇద్దరు పెద్ద స్టార్లకు సంబంధించిన మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాల టీజర్లు కొన్ని గంటల గ్యాప్‌లో రిలీజ్‌ కానుండటం ఆసక్తికరంగా మారింది. టీజర్‌ రిలీజ్‌ కావడమే తరువాతి యూట్యూబ్‌లో నిమిషాల్లోనే లక్షల్లో లైకులు, కోట్లల్లో వ్యూస్‌ వచ్చేస్తుంటాయి.

గత సినిమా టీజర్ల రికార్డులు బద్దలుకొట్టేందుకు ఆయా హీరోల అభిమానులు ప్రయత్నిస్తుంటారు. మరి రెండు భారీ టీజర్లు కొన్ని గంటల వ్యవధిలో రిలీజ్‌ అయితే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు జవాన్‌, సలార్‌ మధ్య కూడా అలాంటి పోటీనే నెలకొంది. దీన్ని సినీ అభిమానులు ప్రభాస్‌ వర్సెస్‌ షారుఖ్‌ ఫైట్‌గా భావిస్తున్నారు. ఫ్యాన్స్‌ను ఏ టీజర్‌ ఎక్కువగా ఆకట్టుకుంటుందో, దేనికి ఎక్కువ లైకులు, వ్యూస్‌ వస్తాయోనని ఇప్పటి నుంచే ఇద్దరు హీరోల అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. మరి ప్రభాస్‌ వర్సెస్‌ షారుఖ్‌ పోటీలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి