iDreamPost

IND vs ENG: అండర్సన్‌ అహంకారానికి సరిగ్గా బదులిచ్చిన టీమిండియా! ఈ కసే కావాల్సింది!

విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ విజయంతో.. అండర్సన్ కు ధీటైన జవాబు ఇచ్చింది.

విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ విజయంతో.. అండర్సన్ కు ధీటైన జవాబు ఇచ్చింది.

IND vs ENG: అండర్సన్‌ అహంకారానికి సరిగ్గా బదులిచ్చిన టీమిండియా! ఈ కసే కావాల్సింది!

విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ ను 106 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. దీంతో తొలి టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. సమష్టిగా రాణించిన భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. అయితే మూడో రోజు ఆటముగిసిన తర్వాత టీమిండియాపై అహంకారపూరిత మాటలు మాట్లాడాడు. భారత్ కు ఎన్ని పరుగులు లక్ష్యంగా విధించాలో కూడా తెలీదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. తాజాగా సాధించిన విజయంతో అండర్సన్ కు ధీటైన జవాబు ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ సైతం అండర్సన్ పై ఫైర్ అవుతున్నారు.

సాధారణంగా క్రికెట్ లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం అనేది సర్వసాధారణమైన విషయమే. అయితే ఆ మాటలు కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రౌండ్ లో ఘర్షణకు దారితీస్తాయి. ఇక మరికొందరు మాత్రం మ్యాచ్ కు ముందు ఆటగాళ్ల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి నోరు పారేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో నోరు పారేసుకున్నాడు స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్. మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత అండర్సన్ మాట్లాడుతూ..

“టీమిండియాకు ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచాలో తెలీదు. ఈ విషయం ఈ రోజు ఇండియా బ్యాటింగ్ చూస్తేనే తెలిసింది” అంటూ వెటకారంగా మాట్లాడాడు అండర్సన్. అయితే అండర్సన్ వ్యాఖ్యలకు విజయంతో ధీటైన జవాబు చెప్పింది భారత జట్టు. ఇక ఈ గెలుపుతో ఫ్యాన్స్ అండర్సన్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఏం చేయాలో టీమిండియాకు తెలుసు, మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాటకు ఆటతోనే సమాధానం చెప్పిన టీమిండియాకు కంగ్రాట్స్.. ఈ కసే మాకు కావాల్సింది అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. అండర్సన్ అహంకారానికి ఇది ధీటైన కౌంటర్ .

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా తొలి ఇన్నింగ్స్ 396 & 255 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 253 & 292 పరుగులు చేసింది. భారత బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్ లో అద్బుతంగా రాణించడంతో.. 106 పరుగులతో విజయం సాధించింది. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మరి అండర్సన్ అహంకారానికి ధీటైన జవాబు చెప్పి.. విజయం సాధించిన టీమిండియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ అదరహో.. 45 ఏళ్ల రికార్డు బద్దలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి