iDreamPost

టీడీపీ, జనసేన నేతల మధ్య రచ్చ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతల్లో వైరం మొదలైంది. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోకి పవన్ ఫ్యాన్స్ చొచ్చుకుపోయి వీరంగం సృష్టించారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతల్లో వైరం మొదలైంది. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోకి పవన్ ఫ్యాన్స్ చొచ్చుకుపోయి వీరంగం సృష్టించారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ, జనసేన నేతల మధ్య రచ్చ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వర్గంలో అల్లకల్లోలం మొదలైంది. టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడి తొలి జాబితా విడుదల చేసిన నాటి నుండి ఆ రెండు పార్టీల నేతల మధ్య అసంతృప్తి పెల్లుబికుతోంది. బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్గగక్కుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాక నేతలకు సీట్లు ఇవ్వకుండా చాలా మందికి హ్యాండ్ ఇచ్చారు ఆయా పార్టీల అధినేతలు. దీంతో అధ్యక్షులపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యాయి టీడీపీ, జనసేనలు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం 24 సీట్లను ఇచ్చింది టీడీపీ. అలాగే..3 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది. పాతిక వంతు కూడా సీట్లు కేటాయించకపోవడంపై అటు టీడీపీపై, కిమ్మనకుండా తీసుకున్న జనసేనపై మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.

బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు . ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా అంబాజీ పేటలో చేపట్టిన ఓ కార్యక్రమం రసాభాసగా ముగిసింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జోన్ 2 ఇన్ చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, అమలా పురం టీడీపీ పార్లమెంట్ ఇన్ చార్జ్ గంటి హరీష్ మాధుర్, రాజేష్ మహాసేన తదితరులు హాజరయ్యారు.

సమన్వయ కమిటీ సమావేశం మండల వారీగా జరుగుతుండగా.. ఇప్పడు అంబాజీ పేట మండలంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో చొచ్చుకుని వచ్చారు జన సేన నేతలు. మహా సేన రాజేష్ కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారన్న అసంతృప్తిలో ఉన్న జనసేన నేతలు.. వీరంగం సృష్టించారు. మహా సేన రాజేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతడికి  చుక్కలు చూపించారు పవన్ ఫ్యాన్స్. సమావేశంలో ఉన్న కుర్చీలను, బల్లలను విరగొట్టారు. రాజేష్ గో బ్యాక్ అంటూ నినదించారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కూమారుడు హారీష్ మాధుర్ కారును ధ్వంసం చేశారు.

మొత్తానికి సమావేశం రసాభాసగా ముగిసింది. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించే లక్ష్యంతో టీడీపీ, జనసేనలు పొత్తు కుదుర్చుకున్న సంగతి విదితమే. తాజాగా 118 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఆనాటి నుండి ఇరు పార్టీల నేతల్లో ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా,  కోనసిమ జిల్లాలోని పి  గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించింది టీడీపీ. అప్పటి నుండి  జన సైనికులు మండిపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి