iDreamPost

టిడిపి – పెద్దల‌ సభలో పెద్దరికం నిరూపించుకుందా?

టిడిపి – పెద్దల‌ సభలో పెద్దరికం నిరూపించుకుందా?

రాష్ట్రంలో టిడిపి వ్యవహారిక శైలి‌ చూస్తుంటే.. రాజకీయాలు ఇంత చెత్తగా తయారయ్యాయా అనిపిస్తుంది. టిడిపి నేతలు రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. పోనీ అవి ప్రజలకు ఉపయోగపడతాయా? అంటే అది లేదు. ఏదో రాద్ధాంతం చేసి, తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకునేందుకు టిడిపి నేతలు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే అచ్చెన్నాయుడు అరెస్టును బిసిలకు, ఉత్తరాంధ్రకు ముడిపెట్టారు. ఆరకంగా తన‌ అనుకూల మీడియాతో ప్రచారం చేశారు. కాని‌ అది కాస్తా బెడిసికొట్టింది. ఇలా సంబంధం లేని అంశాలను ముడిపెట్టి రచ్చ రచ్చ చేస్తుంది.

ఇదిలా పక్కనపెడితే..

‌కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సడలింపులు ఎక్కువగానే ఉన్నాయి. లాక్ డౌన్ అనంతరం దేశంలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా నడిపిన ఘనత ఆంధ్ర రాష్ట్రానికే దక్కుతుంది. రాష్ట్ర బడ్జెట్ ఆమోదం కోసం పెట్టిన రెండు రోజుల సమావేశాల్లో అనేక కీలక తీర్మానాలు, బిల్లులు ఆమోదించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ తీర్మానం ఆమోదించారు. బడ్జెట్ ఆమోదం పొందకుండానే శాసన మండలి వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షల వాగ్వాదం నడుమ మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే బడ్జెట్ కు శాసన మండలి ఆమోదం తప్పనిసరి కాదు. ఎందుకంటే బడ్జెట్ అనేది ఆర్థిక బిల్లు. ఆర్థిక బిల్లు పై సర్వధికారాలు శాసన సభకే ఉంటుంది. అందుకే శాసన సభ ఆమోదం పొందితే బడ్జెట్…అమలులోకి వచ్చేస్తుంది.

అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ప్రతిపక్ష పాత్ర పోషిచిందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ రెండు రోజుల పాటు టిడిపి వ్యవహారించిన వైఖరి చూస్తుంటే అనేక సందేహాలు రాక తప్పదు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టిడిపి అందులో‌ అట్టర్ ప్లాప్ అయింది. ప్రజా సమస్యల ఊసేలేదు. కేవలం టిడిపి అజెండాను మాత్రమే అమలు చేశారు. అధికార పార్టీ నేతపై దాడులకు ఒడిగట్టారు. ప్రజా సమస్యలను లేవనెత్తని టిడిపి ప్రతిపక్ష పాత్ర పోషించిందంటే ప్రజలు‌ ఎలా నమ్ముతారు. టిడిపి ప్రతిపక్ష పార్టీకి కూడా పనికిరాదని స్పష్టం అయిపోయింది.

ఇకపోతే పెద్దల సభలో తానే పెద్ద మనిషి, తానే సీనియర్ ని, అలాగే నాకే అన్ని శాసన వ్యవహారాల గురించి తెలుసు అని స్వప్రకటిత మేథావి తన పెద్దరికం నిలబెట్టుకున్నాడా..? అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. ఆయనేవరో కాదు. యనమల రామకృష్ణుడు. టిడిపి తరపున శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నడు. అయితే ఆయనెప్పుడూ ప్రతిపక్ష పాత్రను పోషించలేదు. ఎప్పుడూ అది అడ్డుకుంటాం…ఇది అడ్డుకుంటామని మాత్రమే ప్రకటనలు ఇస్తారు.

పెద్దల సభకు తలవంపులు తెచ్చేలా శాసనమండలిలో ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించారు. బూతులు తిట్టుకోవడం తోపాటు అధికార పక్ష మంత్రులని ఎగిరెగిరి తన్నారు. అరుపులు, కేకలతో హాలు రణరంగంగా మారింది. వృద్ధ సభ్యులు ఆందోళనకు గురై ఎక్కడివారక్కడ సీట్లలో కూర్చుండిపోయారు. ఘర్షణ అనంతరం పలువురు సభ్యులు బయటకొచ్చి వణికిపోయారు. ఇంత జరుగుతుంటే టిడిపి అధినేత తనయుడు లోకేష్‌ తన సీటు వద్ద నుండి ఫొటోలు తీస్తూ ఎంజాయ్ ‌చేశారు. ఇంత జరుగుతుంటే పెద్దరికం వహించాల్సిన యనమల టిడిపి నేతలను వారించకుండా మరింతగా రెచ్చ గొట్టే విధంగా ప్రవర్తించారు. టిడిపి సభ్యులు తీరుతో శాసన వ్యవస్థకే కళంకం వచ్చి పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి