iDreamPost

దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కౌన్సిల్లో టిడిపి ఓవర్ యాక్షన్

దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా  కౌన్సిల్లో టిడిపి ఓవర్ యాక్షన్

తెలుగుదేశంపార్టీ శాసనమండలిలో ఓవర్ యాక్షన్ చేసింది. గవర్నర్ ప్రసంగానికే ఏకంగా సవరణల తీర్మాన్ని ప్రవేశపెట్టటం విచిత్రంగా ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వజిత్ హరిచందన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగం అయిపోగానే ధన్యవాద తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడుతారు. అధికార సభ్యులేమో ధన్యవాదాలు చెబితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం తప్పులను ఎత్తి చూపుతారు. సరే చివరకు ఓటింగ్ ద్వారానో లేకపోతే ఏకగ్రీవంగానో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాల ఘట్టం పూర్తవుతుంది.

ఇపుడు కూడా అధికార వైసిపి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మెజారిటి కారణంగా తీర్మానాన్ని ఆమోదించేసింది. సరే ఆ సమయంలో టిడిపి ఎలాగూ సభలో లేదు కాబట్టి సమస్యే లేదు. అయితే సమస్యంతా శాసనమండలిలోనే మొదలైంది. ఎందుకంటే కౌన్సిల్లో వైసిపికి మెజారిటి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తనకున్న మెజారిటి టిడిపి నానా రచ్చ చేస్తున్న విషయాన్ని అందరు చూస్తున్నదే.

ఇపుడు కూడా ఇలాంటి రచ్చే చేసింది. దేశచరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నర్ ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించాలని, మరికొన్ని అంశాలకు సవరణలు చేయాలంటూ పట్టుబట్టింది. గవర్నర్ ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించాలని, సవరణలు చేయాలని టిడిపి పట్టుబట్టడంతో కౌన్సిల్లోని మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఎక్కడైనా ప్రతిపక్షాలు చెప్పిన సవరణకు అధికారపార్టీ ఆమోదం చెబుతుందా ? అంటూ ప్రతిపక్షాలు బిజెపి, వామపక్షాల సభ్యులు ఆశ్చర్యపోయారు.

గవర్నర్ ప్రసంగంలోని కొంత భాగాన్ని తొలగించాలని, సవరణలు చేయాలని పట్టుబట్టడమే వింత అయితే మూజువాణి ఓటుతో సభ దాన్ని ఆమోదించటం మరింత విచిత్రంగా ఉంది. రాష్ట్ర జిడిపి, తలసరి ఆదాయంపై గవర్నర్ ప్రసంగంలో చదివింది సరికాదని టిడిపి అభ్యంతరాలు చెప్పింది. బలహీనవర్గాల సంక్షేమం, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం అంశాలను ప్రభుత్వం విస్మరించిందని టిడిపి మండిపోయింది.

అలాగే రాజ్యాంగ నియమాలకు, హైకోర్టు సూచనలకు విరుద్ధంగా ఆర్డినెన్సులు జారీ చేస్తోందంటూ టిడిపి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. ఇష్టముంటే ధన్యవాదాలు చెప్పాలి లేకపోతే తిరస్కరించాలే కానీ ఇలా సవరణలు చేయాలని పట్టుబట్టడం, కొంత భాగాన్ని తొలగించాలని డిమాండ్ చేయటం టిడిపి ఓవర్ యాక్షన్ చేస్తోందనేందకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కొసమెరుపేమిటంటే టిడిపి ఓవర్ యాక్షన్ను ఎల్లోమీడియానే ప్రస్తావించటం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి