iDreamPost

పులివెందుల TDP ఇంచార్జ్‌ బీటెక్‌ రవి అరెస్ట్‌.. కారణమిదే

  • Published Nov 15, 2023 | 9:41 AMUpdated Nov 15, 2023 | 9:41 AM

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన మీద క్రికెట్‌ బెట్టింగ్‌ ఆరోపణలు మాత్రమే కాక పది నెలల క్రితం నమోదైన ఓ కేసు కూడా పెండింగ్‌లో ఉంది. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన మీద క్రికెట్‌ బెట్టింగ్‌ ఆరోపణలు మాత్రమే కాక పది నెలల క్రితం నమోదైన ఓ కేసు కూడా పెండింగ్‌లో ఉంది. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Nov 15, 2023 | 9:41 AMUpdated Nov 15, 2023 | 9:41 AM
పులివెందుల TDP ఇంచార్జ్‌ బీటెక్‌ రవి అరెస్ట్‌.. కారణమిదే

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీటెక్‌ రవి మీద క్రికెట్‌ సహా పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం పోరుమామిళ్లలో వెలుగు చూసిన బెట్టింగ్‌ వ్యవహారం అంతా రవి కనుసన్నల్లోనే నడిచినట్లు తెలుస్తోంది. అంతేకాక రవి మీద పది నెలల క్రితం వల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఓ కేసు పెండింగ్‌లో ఉంది.

ఈక్రమంలో తాజాగా పోలీసులు బీటెక్‌ రవిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. వెంటనే రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పర్చారు. ఈ క్రమంలో మేజిస్ట్రేటు.. తిరిగి బుధవారం ఉదయం మళ్లీ హాజరు పరచాలని ఆదేశించారు.

ఇక కొన్ని రోజుల క్రితం పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో.. బీటెక్‌ రవి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. క్రికెట్‌ బెట్టింగ్‌ విషయాల్లో వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సీరియస్‌గా ఉండటమే కాక.. స్థానికంగా పేరున్న లాడ్జిల్లో ఆయనే స్వయంగా తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్‌ అణిచివేతలో భాగంగా దాని మూలాలపై దృష్టి సారించి.. లోతుగా దర్యాప్తు చేయగా.. పోరుమామిళ్ల బెట్టింగ్‌ వ్యవహారం మొత్తం బీటెక్‌ రవి కనుసన్నుల్లోనే నడిచినట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ బెట్టింగ్‌ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు పక్కా ఆధారాలు దొరకటంతో… బీటెక్‌ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే యోగివేమన యూనివర్శిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో బీటెక్‌ రవి ఉండడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పది నెలల క్రితం నమోదైన కేసు ఏంటంటే..

వల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు ఏంటి అంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు అనగా జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. లోకేష్‌కు స్వాగతం పలకడానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఓ పోలీసుపై దురుసుగా ప్రవర్తించి, కాలు ఫ్యాక్చర్‌ కావడానికి బీటెక్‌ రవి కారకుడైనట్లు అప్పట్లో వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్‌ కేసుతో పాటు.. ఈ కేసులో కూడా బీటెక్‌ రవిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కిడ్నాప్‌ అంటూ హైడ్రామా..

పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌ కేసుకు సంబంధించి బీటెక్‌ రవిని అదుపులోకి తీసుకోగానే.. టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి.. బీటెక్‌ రవిని కిడ్నాప్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది చూసి ఎలోల​ మీడియా బీటెక్‌ రవి కిడ్నాప్‌ అంటూ కాసేపు సోషల్‌ మీడియాలో హైడ్రామా క్రియేట్‌ చేసింది. చివరకు పోలీసులు రవి అరెస్ట్‌ను నిర్ధారించడంతో.. ఈ పుకార్లకు తెర పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి