iDreamPost

ప్రభుత్వాన్ని అంత సులువుగా రద్దు చేయవచ్చా..?

ప్రభుత్వాన్ని అంత సులువుగా రద్దు చేయవచ్చా..?

ఎలక్షన్ కమిషనర్ కేంద్రానికి రాసిన లేఖ ఆధారంగా ఆర్టికల్ 356 కింద ఈ రాష్ట్రప్రభుత్వాన్ని వెంటనే రద్దు చెయ్యాలని అచ్చెం నాయుడు నాయుడు ఆరోపించడం చూస్తుంటే.. ముందు అసలు నిజంగా ఎన్నికల కమిషనర్ ఆ లేఖ రాశాడా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే.. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యడం.. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అంటే మరి అంత సులువా ?? ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడం అంటే అదేమైనా అధికారులను సస్పెండ్ చేసినంత సులువా ?? రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రత్యేక పరిస్థితుల్లోనో.. లేదా రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడే ప్రభుత్వాలను బర్తరఫ్ చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది కానీ కేవలం రాజకీయ కారణాల వల్ల రాజకీయ విమర్శలు వల్ల ప్రభుత్వాలను ఎప్పుడైనా రద్దు చేశారా??

ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరో సాధారణ పార్టీ కార్యకర్త అయితే అనుకోవచ్చు సాక్షాతూ రాష్ట్రానికి ఐదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి కూడా అదేదో అమ్మరాజ్యం కడప రెడ్లు సినిమాలో ప్రతిపక్షాలు చేసినట్టు రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యడం ఒక్కటేమార్గం అన్నట్టు అచ్చెం నాయుడు ఏకవాక్య తీర్మానాలు చెయ్యడం చూస్తుంటే వారికి మన రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, ఫెడరల్ వ్యవస్థ మీద ఎంత మాత్రం అవగాహన ఉందో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి ఇట్టే అర్ధమవుతోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీలది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పోరాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప ఈమధ్య వచ్చిన అమ్మరాజ్యం లో కడప బిడ్డలు సినిమాలో మాదిరి పాడిందే పాట రా.. అన్నట్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాల్సిందే అని మాటిమాటికీ ఇవే డిమాండ్లు చేస్తూ పొతే ప్రజలలో చులకన అవ్వడం తప్ప ప్రతిపక్షం ఆశించిన ప్రయోజనం నెరవేరదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ లెక్కన అధికారులు రాసిన లేఖలు ఆధారంగా ప్రభుత్వాలను రద్దు చేసే పనైతే గత ప్రభుత్వాలను ఎన్నిసార్లు రద్దు చేయాల్సి వచ్చేదో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి