iDreamPost

కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ ఓడిపోయిందా..? సర్పంచ్‌ ఏం చెబుతున్నారు..?

కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ ఓడిపోయిందా..? సర్పంచ్‌ ఏం చెబుతున్నారు..?

తమకు నష్టం కలిగించే అంశాలు, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో తెలుగుదేశం పార్టీకి పెట్టింది పేరు. ఇది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలు వెల్లడైన సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తనకు మాత్రమే అబ్బిన ఈ నైపుణ్యాన్ని మరోసారి బయటపెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులు విజయదుందిబి మోగించారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ ఆధినేత నారా చంద్రబాబు నుంచి అనుకూల మీడియా, టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌లు మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకున్నాయి. కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలిచిందంటూ ప్రచారం హోరెత్తించాయి.

ఈ ప్రచారం చూసిన వారు నిజమేనా..? అనే సందేహాలు వ్యక్తం చేశారు. అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు విషయం తెలుసుకుని ఔరా.. నారా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కొడాలి నాని స్వగ్రామమని చెబుతున్న పంచాయతీ పేరు యలమర్రు. ఇది పామర్రు నియోజకవర్గం పరిధిలోని పెదపారుపూడి మండలంలో ఉంది. ఇది కొడాలి నాని పూర్వీకుల గ్రామం. ఈ గ్రామంలోని రాజకీయాల్లో ఏనాడు కొడాలి నాని కలుగజేసుకుంది లేదు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ వైపు చూడలేదు. కానీ నాని స్వగ్రామంలో వైసీపీ ఓడిపోయిందనే ప్రచారం టీడీపీ సాగించింది. అక్కడ ఫలితాలను మంత్రికి ముడిపెట్టారు. అసలు విషయం తెలియడంతో తమ పార్టీ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ అధినేత ఈ గేమ్‌ ఆడారని అందరికీ అర్థమైంది.

ఈ తరహా ప్రచారం సాగడంతో యలమర్రులో సర్పంచ్‌గా గెలిచిన ప్రజా ప్రతినిధి సీన్‌లోకి వచ్చారు. జరుతున్నది తప్పుడు ప్రచారమని ఖండించారు. కొడాలి నాని తమ గ్రామంలో ఎలాంటి రాజకీయాలు చేయలేదని టీడీపీ మద్ధతుతో గెలిచిన శిరీషా స్పష్టం చేశారు. గ్రామస్తుల సహకారంతో గెలిచానని, రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానంటూ ప్రకటించి, మంత్రి నానిపై దుష్ప్రచారం చేస్తున్న వారి నోళ్లు మూయించారు. సర్పంచ్‌ శిరీషా విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో టీడీపీ నేతల నోళ్లు మూతబడ్డాయి.

కొడాలి నాని కూడా ఈ ప్రచారంపై స్పదించారు. యలమర్రు తమ గ్రామమని జరుగుతున్న ప్రచారం తప్పు అని ఖండించలేదు. అసలు విషయాన్ని తెలిపారు. యలమర్రు తమ పూర్వీకుల గ్రామమని చెప్పారు. ఆ గ్రామ రాజకీయాల్లో తాను ఎప్పుడూ ఇన్వాల్‌ కాలేదని స్పష్టం చేశారు. తన తాత, తండ్రి, తాను గుడివాడలోనే పుట్టి, పెరిగామని అసలు విషయం బయటపెట్టారు. మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు ఉండడంతో.. పంచాయతీ పోరు ముగిసిన తర్వాత ఈ నెల 21న అన్ని విషయాలపై బహిరంగంగా మాట్లాడుకుందామని కొడాలి నాని తనదైన సై్టల్లో చెప్పారు.

కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారాలు చేయడం టీడీపీకి ఇదేమి కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో అనేక అంశాలలో కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోనూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరును, వైఫల్యాలను, నారా లోకేష్‌ పనితనాన్ని కొడాలి నాని తూర్పారబడుతుండడంతో మంత్రి వారికి లక్ష్యంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే కొడాలిని ఇబ్బంది పెట్టాలని యత్నిస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని కించపరిచారని, పేకాటాడుతున్న వారిపై దాడులు చేస్తే.. అవి నిర్వహించేది మంత్రి తమ్ముడేనని.. ఇలా మోకాలికి బొడిగుండుకు ముడేసి మంత్రి కొడాలిపై దుష్పచారం చేస్తున్నారు. తాజాగా మంత్రి స్వగ్రామంలో టీడీపీ గెలుపు కూడా ఇలాంటిదేనని సర్పంచ్‌ శిరీషా ప్రకటనతో తేలిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి