iDreamPost

అక్రమ మద్యం సరఫరా – టీడీపీ మాజీ ఎం.ఎల్.ఏ తనయుడు అరెస్టు

అక్రమ మద్యం సరఫరా – టీడీపీ మాజీ ఎం.ఎల్.ఏ తనయుడు అరెస్టు

గడిచిన 5ఏళ్ళలో ధనార్జనే ధ్యేయంగా బ్రతికిన తెలుగుదేశం పార్టీలోని కొందరు సభ్యులు అధికారం కోల్పోయిన తరువాత కూడా వారి పంథా మార్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే అనేకమంది తెలుగుదేశం సభ్యులు ఇసుకని అక్రమంగా తరలిస్తు, నాటు సారా తయారు చేస్తూ , గుట్కా ప్యాకెట్లు అక్రమంగా సరఫరా చేస్తూ పొలీసులకి చిక్కారు. ఇప్పుడు తాజాగా స్వయాన తెలుగుదేశం పార్టీ కి చెందిన మాజీ శాసన సభ్యుని కొడుకే కర్నాటక నుండి అక్రమంగా మద్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తూ పోలీసులకి పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెలితే రాయదుర్గానికి చెందిన తెలుగుదేశం మాజీ శాసన సభ్యుడు బండి హులికుంటప్ప కొడుకు విక్రం కుమార్ పట్టపగలే కర్నాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్ చెక్ పోస్టు దగ్గర అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ధనుంజయ ఆద్వర్యంలో ఎక్సైజ్‌ సీఐ కృష్ణ, ఎక్సైజ్‌ ఎస్‌ఐ షేక్షావలి తదితరులు తనిఖీలు నిర్వహిస్తుండగా కేఏ 34ఏ5856 నంబరుగల టాటా ఏస్‌ లగేజ్‌ వాహనం లో 624 కర్ణాటక మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో అర్బన్ సి.ఐ తులసీరాం, సి.ఐ పవన్ కుమార్ మాజీ శాసన సభ్యుడు బండి హులికుంటప్ప కొడుకు విక్రం కుమార్ తో పాటు అదే వాహనంలో ఉన్న పచ్చిమ బెంగాల్ కు చెందిన మరో ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఈ కేసులో మాజీ శాసన సభ్యుడు కుమారుడు ఉండటంతో కేసు నమోదు చేయకుండా చూడాలని ఎక్సైజ్‌ పోలీసులపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయగా. ఇది ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎంఫొర్స్మెంట్ బ్యూరో పరిధిలో ఉండటంతో వారి ఒత్తిళ్ళు ఫలించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి