iDreamPost

టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన..

టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన..

ఇటీవల టీడీపీ కేంద్ర కమిటీ, పార్లమెంట్‌ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులతోపాటు కమిటీని ప్రకటించాల్సి ఉన్నా.. కసరత్తు కొలిక్కి రాలేదనే కారణంతో వాయిదా వేశారు. తాజాగా 219 మంది నేతలతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, కోశాధికారులు ఉన్నారు.

ఏ ఏ కులాల వారికీ ఎన్ని పార్టీ పదవులు కేటాయించామో కూడా టీడీపీ అధినేత వెల్లడించారు. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11, ఎస్టీలకు 3, మైనారిటీలకు 6 శాతం చొప్పన పదవులు కల్పించినట్లు వివరించారు. మొత్తం మీద బడుగు బలహీన వర్గాల వారికి 61 శాతం పదవులు ఇచ్చినట్లు ప్రకటించారు. 50 బీసీ ఉపకులాల వారికీ కమిటీల్లో స్థానం కల్పించినట్లు చెప్పుకొచ్చారు.

టీడీపీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డిని చంద్రబాబు నియమించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిమ్మల క్రిష్టప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, జోత్యలు నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానంద రావు, రత్నం, దాట్ల సుబ్బరాజు, సాయి కల్పనా రెడ్డి, వేద వ్యాస్, సుజయ కృష్ణ రంగారావు, జయనాగేశ్వరరెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, జి.తిప్పస్వామి, హనుమంతరాయ చౌదరి, నర్సింహారెడ్డి, దామచర్ల జనార్థన్‌ రావు, శ్రీధర్‌ కృష్ణా రెడ్డి, వేమూరి ఆనంద్‌ సూర్యలు నియమితులయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి