iDreamPost

దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా TATA మోటార్స్‌.. మారుతీని దాటేసింది!

దేశీయ దిగ్గజ ఆటోమైబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా టాటా మోటార్స్‌ నిలిచింది. ఈ క్రమంలో మారుతీ సుజుకీని దాటేసింది.

దేశీయ దిగ్గజ ఆటోమైబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా టాటా మోటార్స్‌ నిలిచింది. ఈ క్రమంలో మారుతీ సుజుకీని దాటేసింది.

దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా TATA మోటార్స్‌.. మారుతీని దాటేసింది!

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త హిస్ట్రీ క్రియేట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమోబైల్ కంపెనీగా నిలిచింది. ఈ క్రమంలో మారుతీ సుజుకీని టాటా మోటార్స్ దాటేసింది. టాటా మోటార్స్ కార్లు, ట్రక్కులు, బస్సులు, వ్యాన్లను తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటుంది. టాటా కంపెనీకి చెందిన వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో డీవీఆర్‌ షేర్లు, కంపెనీ మార్కెట్ విలువ పరంగా టాటా మోటార్స్ మారుతీ సుజుకీ ని వెనక్కి నెట్టి టాటా కంపెనీ ఈ రోజు సరికొత్త చరిత్ర సృష్టించింది.

టాటా మోటార్స్ షేర్లు 5 శాతానికి పైగా లాభంతో 52 వారాల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో టాటా యొక్క మార్కెట్ క్యాప్ భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీని అధిగమించింది. టాటా మోటార్స్‌ విలువ రూ.2,85,515.64 కోట్లు, టాటా మోటార్స్‌ లిమిటెడ్ డీవీఆర్‌ విలువ రూ.29,119.42 కోట్లతో కలిపి మొత్తం రూ.3,14,635.06 కోట్ల మార్కెట్‌ విలువతో ఆటోమొబైల్ కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రూ.3,13,058.50 కోట్లతో మారుతీ సుజుకీ రెండో స్థానానికి పరిమితమైంది.

ఈరోజు మార్కెట్లో టాటా మోటార్స్ షేర్లు 5 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో 886.30 స్థాయికి చేరుకున్నాయి. టాటా మోటార్స్ షేర్లు గత ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 91 శాతం రాబడిని అందించాయి. ఏడాది కాలంలో ఈ కంపెనీ స్టాక్ రూ.412.80 పెరిగింది. జనవరి 31, 2023న, ఈ షేర్ ధర దాదాపు రూ. 450. అదే సమయంలో, నేడు ఈ షేర్ 885.95 స్థాయిని దాటింది. కాగా మారుతి షేర్ 1 సంవత్సరంలో 12 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో మారుతీ షేర్లు పెట్టుబడిదారులకు 11.86 శాతం రాబడిని అందించాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి