iDreamPost

స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్​కు ముందు రిటైర్మెంట్!

  • Author singhj Published - 02:25 PM, Thu - 6 July 23
  • Author singhj Published - 02:25 PM, Thu - 6 July 23
స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్​కు ముందు రిటైర్మెంట్!

ఏ ఆటగాడైనా ఎప్పటికైనా రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. ఎంతటి ప్లేయర్ అయినా సరే.. ఏదో ఒక రోజు గేమ్ నుంచి నిష్క్రమించాల్సిందే. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం ఈ విషయంలో అనూహ్యంగా నిర్ణయం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. జట్టుకు ఇంకా సేవలు అందించే సత్తా తమలో ఉన్నా కూడా కొనసాగకుండా షాక్​కు గురిచేస్తారు. ఇప్పడో స్టార్ క్రికెటర్ ఇదే పని చేశాడు. బంగ్లాదేశ్​ వన్డే టీమ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్​ 2023 టోర్నమెంట్​కు ఇంకా 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ టైమ్​లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడతను.

తమీమ్ ఇక్బాల్ అనూహ్య నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్​ అవుతున్నారు. కెరీర్​కు సంబంధించిన ఇంత కీలక నిర్ణయాన్ని ఇలా హఠాత్తుగా తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. వరల్డ్ కప్​కు ముందు రిటైర్మెంట్ ఇవ్వడం అంటే జట్టును మధ్యలో వదిలేసి వెళ్లిపోవడమేనని చెబుతున్నారు. తమీమ్ చేసింది కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక, 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు తమీమ్ ఇక్బాల్. 16 ఏళ్ల కెరీర్​లో బంగ్లాదేశ్ తరఫున 69 టెస్టులతో పాటు 238 వన్డేలు, 78 టీ20 మ్యాచ్​లు ఆడాడు. టెస్టుల్లో 10 సెంచరీలు సహా 5,082 రన్స్ చేశాడు.

వన్డేల్లో తమీమ్ ఇక్బాల్​కు అద్భుతమైన రికార్డు ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్​లో 14 సెంచరీలతో 8,224 రన్స్ చేశాడతను. పొట్టి ఫార్మాట్​లో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 1,758 రన్స్ చేశాడు. బంగ్లా టీమ్ కెప్టెన్​గా 2020లో బాధ్యతలు తీసుకున్నాడు తమీమ్. సారథిగా 15 మ్యాచుల్లో నేతృత్వం వహించి, జట్టుకు 8 విజయాలు అందించాడు. గతేడాది జనవరిలో టీ20ల నుంచి ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకున్నాడు తమీమ్. ఆ తర్వాత జూన్​లో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ జట్టు తరఫున 10 వేలకు పైగా రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్​గా రికార్డు క్రియేట్ చేశాడు తమీమ్ ఇక్బాల్. అలాగే 14 వేలకు పైగా ఇంటర్నేషనల్ రన్స్ చేసిన ఏకైక బంగ్లా బ్యాటర్​గానూ ఉన్నాడు. ఆ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ కూడా తమీమ్ కావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి