iDreamPost

నవ్వులపాలు చేసిన అక్షర దోషం.. DMK నేతలపై ట్రోలింగ్!

DMK: తరచూ ఏదో ఒక విషయంలో రాజకీయ నేతలు ట్రోల్స్ కి గురవుతుంటారు. ముఖ్యంగా వారు చేసే వ్యాఖ్యలు, వారిపై ఏర్పడిన పోస్టర్ల కారణంగా ట్రోల్స్ కి గురవుతుంటారు. తాజాగా అక్షర దోషం కారణంగా ఓ పార్టీ నేతలపై ట్రోలింగ్స్ వచ్చాయి.

DMK: తరచూ ఏదో ఒక విషయంలో రాజకీయ నేతలు ట్రోల్స్ కి గురవుతుంటారు. ముఖ్యంగా వారు చేసే వ్యాఖ్యలు, వారిపై ఏర్పడిన పోస్టర్ల కారణంగా ట్రోల్స్ కి గురవుతుంటారు. తాజాగా అక్షర దోషం కారణంగా ఓ పార్టీ నేతలపై ట్రోలింగ్స్ వచ్చాయి.

నవ్వులపాలు చేసిన అక్షర దోషం.. DMK నేతలపై ట్రోలింగ్!

చిన్న చిన్న తప్పులే మనల్ని నవ్వుల పాలు చేస్తాయి.  సామాన్యుల విషయంలో ఇలాంటివి పెద్దగా బయటకి రాకపోవచ్చు. కానీ సినీ, రాజకీయ నాయకుల విషయంలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే.. మాత్రం అది పెద్ద రచ్చ అవుతోంది. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ విషయంలో, వారి ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లలో జరిగే చిన్న అక్షర దోషాలు..వారిని నవ్వుల పాలు చేస్తుంటాయి. తాజాగా తమిళనాడులో ఓ చిన్న అక్షర దోషం.. డీఎంకే నేతలపై ట్రోలింగ్స్ వచ్చేలా చేసింది. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్టాలిన్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన రాజకీయంతో అందరిని కలుపుకుంటూ ముందుకెళ్లారు. చాలా ఏళ్ల కృషి తరువాత గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అనేక పథకాలను తీసుకొచ్చి ప్రజల్లో గుర్తింపుం పొందారు.

ప్రభుత్వ పాఠశాలలు, పేదలకు సంక్షేమం అందించడంలో ఆయన తనదైన మార్క్ ను చూపించారు. ఇదే సమయంలో డీఎంకేకి చెందిన నేతలు స్టాలిన్ పేరుతో పోస్టర్లు వేస్తుంటారు. తాజాగా ఓ విషయంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రశంసలు తెలుపుతూ వెలసిన పోస్టర్లు వేశారు. అయితే ఆ పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, నెట్టింట్ల తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే.. వైరల్ అవుతున్న పోస్టర్ ల్లో  సీఎం ఎంకే స్టాలిన్ చిత్రంపై ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని రాసి ఉండటమే.

టైమ్స్ నౌ ప్రకారం తెలిపిన వివరాల ప్రకారం.. ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అనే పదాలతో పోస్టర్‌ను ముద్రించాలని డీఎంకే నేతలు ప్లాన్ చేశారని టాక్.  అయితే, అక్షర దోషంతో అది ఫ్రైడ్ కాస్తా బ్రైడ్ అయింది. దీంతో ‘బ్రైడ్‌ ఆఫ్‌ తమిళనాడు’ గా మారి సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. అయితే ఈ ఇంతకీ ఈ పోస్టర్‌ను ఎవరు వేశారు? ఎక్కడ పెట్టారు? అనేది తెలియరాలేదు. అయితే, ఈ పోస్టర్‌ ఉన్న వీడియోను తీసిన పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు.

ఈ ట్రోలింగ్ వైరల్ అవుతోంటే.. తమిళనాడులోని కులశేఖ పట్టణంలో నిర్మిస్తోన్న ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను ఉద్దేశించి డీఎంకే మంత్రి అనిత ఆర్‌ రాధాక్రిష్ణన్‌ ప్రకటన ఇచ్చారు. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం స్టాలిన్‌ ఫోటోలతో పాటు వెనకవైపున రాకెట్‌పై చైనా జెండా ఉండటంతో వివాదానికి కేంద్రబిందువుగా మారింది. మొత్తంగా అక్షర దోషం ఉన్న పోస్టర్ వీడియో డీఎంకే నేతలను ట్రోలింగ్స్ కి గురి చేస్తుంది. మరి.. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి