iDreamPost

Tamil Heros కోట్ల మార్కెట్ ఉన్నా రామంటున్న హీరోలు

Tamil Heros కోట్ల మార్కెట్ ఉన్నా రామంటున్న హీరోలు

వచ్చే వారం విడుదల కాబోతున్న విజయ్ Beast Movieకి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విడుదల దక్కనుంది. KGF2తో పోటీ ఉన్నా సరే 10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు సపోర్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా స్క్రీన్లు మంచివే దొరుకుతాయి. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తదితరులు హాజరయ్యారు. అసలైన హీరో విజయ్ మాత్రం డుమ్మా కొట్టేశారు. ఇప్పుడే కాదు గతంలో మాస్టర్, విజిల్, అదిరింది తాలూకు వేడుకలు జరిగినప్పుడు కూడా ఈయన రాలేదు. అసలెందుకు రావడం అనుకుంటున్నారో ఏమో మరి.

ఒకప్పుడు తెలుగులో మార్కెట్టే లేని విజయ్ తుపాకీ నుంచి మెల్లగా ఒక బేస్ ని ఏర్పరుచుకున్నారు. తమిళంలో పెద్ద స్టార్ కావొచ్చు. ఇక్కడ తనను ప్రత్యేకంగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళను ప్రత్యక్షంగా కలవడం చాలా అవసరం. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే అంత పెద్ద సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు తన ఈవెంట్లు ఏవీ ఇక్కడ మిస్ చేయలేదు. ఏదో ఒకటి మాట్లాడి ఫ్యాన్స్ కి కనిపించి ఇండస్ట్రీ పెద్దల్లో కొందరిని గెస్టులుగా పిలిచి తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్న దుల్కర్ సల్మాన్ బజ్ ఉన్నా లేకపోయినా మన దగ్గర ప్రమోషన్ ని మిస్ చేసిన దాఖలాలు లేవు. సూర్య కూడా ఈటి కోసం భాగ్యనగరం వచ్చి వెళ్ళాడు.

ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ విజయ్ మాత్రం ససేమిరా అంటాడు. సినిమా బాగుంటే ఆడుతుంది కదా అనుకుంటే నిన్న చేసిన ఈవెంట్లు కూడా అక్కర్లేదు. పైగా పూజా హెగ్డేతో ఇక్కడ అందరూ విజయ్ ని మిస్ అవుతున్నారని చెప్పించడం మరో కామెడీ. ఎవరిని ఎవరు మిస్ అవుతున్నారు. పాటల డబ్బింగ్ లోనూ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తమిళ పదాలనే లిరిక్స్ లో, టైటిల్స్ లో పెట్టడం చూస్తే విజయ్ అజిత్ లాంటి హీరోలు టేకిట్ గ్రాంటెడ్ సూత్రాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. వలిమై టైంలోనూ అజిత్ హైదరాబాద్ వచ్చినా చాలా సందర్భాల్లో కనీసం మీడియాను కూడా కలవలేదు. దీన్నేమనుకోవాలో వాళ్లే చెప్పాలి మరి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి