iDreamPost

భర్తకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నటి మహాలక్ష్మి.. వీడియో వైరల్‌!

  • Published Jul 10, 2023 | 1:38 PMUpdated Jul 10, 2023 | 3:06 PM
  • Published Jul 10, 2023 | 1:38 PMUpdated Jul 10, 2023 | 3:06 PM
భర్తకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నటి మహాలక్ష్మి.. వీడియో వైరల్‌!

బుల్లితెర నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్‌ల పెళ్లి వార్త.. సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లిపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అందుకు కారణం రవీందర్‌ అధిక బరువు. కేవలం డబ్బుల కోసమే మహాలక్ష్మి.. రవీందర్‌ను వివాహం చేసుకుంది అంటూ చాలా మంది విమర్శించారు. కానీ ఈ దంపతులు మాత్రం.. ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఒకరికి ఒకరు సర్‌ప్రైజ్‌ బహుమతులు ఇచ్చుకుంటూ.. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియజేసుకుంటూ.. తమను విమర్శించిన వారు కుళ్లుకునేంత సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక వీరిద్దరికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే.. వెంటనే సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక తాజాగా నటి మహాలక్ష్మి తన భర్త రవీందర్‌కు అపురూపమైన బహుమతి ఇచ్చి.. అతడిని సర్‌ప్రైజ్‌ చేసింది. భార్య ఇచ్చిన ఆరడుగుల అందమైన ప్రేమ కానుక చూసి అతడు మురిసిపోతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

రవీందర్‌-మహాలక్ష్మిల వివాహం జరిగి ఏడాదిపైనే అవుతోంది. అయినా సరే వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతూనే ఉంటుంది. గతంలో అయితే ఓ సారి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది. కానీ వారు మాత్రం ఆ వార్తల్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. లైఫ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా భర్త పుట్టిన రోజు సందర్భంగా.. అతడిపై తనకున్న ప్రేమను చాటుతూ.. ఆరడుగుల అందమైన కానుక ఇచ్చి.. రవీందన్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది మహాలక్ష్మి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అది వైరలవుతోంది. ఇంతకు మహాలక్ష్మి తన భర్తకు ఏం గిఫ్ట్‌ ఇచ్చింది అంటే..

పుట్టిన రోజు సందర్భంగా ఆరడుగుల ఎత్తులో రవీందర్‌ ఫొటోను పెయింటింగ్‌ చేయించి.. బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చింది మహాలక్ష్మి. తర్వాత భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘నాకు మళ్లీ ధైర్యం ఇచ్చిన మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరే నా బలం.. మీకు సదా కృతజ్ఞురాలిని అయ్యి ఉంటాన’’ అంటూ రాసుకొచ్చింది. ఇక భర్త చేత కేక్‌ కట్‌ చేస్తోన్న వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. చాలా మంది మాత్రం.. మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా.. మీకు నచ్చినట్లు.. జీవితంలో ముందుకు సాగండి అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి