iDreamPost

తాజ్ మహల్ లో ఏముంది?? ఆ 22 గదుల రహస్యం ఏంటి?.. కోర్టులో పిటిషన్..

తాజ్ మహల్ లో ఏముంది?? ఆ 22 గదుల రహస్యం ఏంటి?.. కోర్టులో పిటిషన్..

ప్రపంచంలోని వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి అని చెప్తారు. దీనిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. తాజ్‌మహల్‌ని మెుఘల్‌ చక్రవర్తి షాజహాన్‌, ముంతాజ్‌ ప్రేమకు చిహ్నాంగా కట్టించారని మనకి చరిత్ర చెప్తుంది. యుమునా నది ఒడ్డున తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికి అంతి చిక్కని ఓ నిర్మాణమే. అయితే ఇది తాజ్ మహల్ కాదని, తేజో మహల్ అని, శివుడి ఆలయం అని గత కొన్నేళ్లుగా వాదనలు వినిపిస్తున్నారు. ఒకప్పుడు ఉన్న శివాలయాన్ని మూసేసి దానిపైన షాజహాన్ తాజ్ మహల్ కట్టడాన్ని కొంతమంది అంటారు.

తాజాగా ఈ వ్యవహారం కోర్టుకి చేరడంతో మరోసారి ఈ వాదనలు దేశమంతటా వినిపిస్తున్నాయి. నాలుగు అంతస్థుల తాజ్ మహల్ లో కింది రెండు అంతస్థులలోని దాదాపు 22 గదులని ఎప్పుడో శాస్వితంగా మూసేశారు. అయితే వాటిని ఇప్పుడు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెరిపించాలని, అందులో ఉన్న రహస్యాలని బయట పెట్టాలని బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జ్‌ రజనీష్‌ సింగ్‌ అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు.

చరిత్ర చెప్తున్నట్టు ఇప్పుడు తాజ్ మహల్ ఉన్న ప్లేస్ లో 1212లో రాజా పరామర్ది దేవ్ అక్కడ ఓ శివాలయం కట్టించారని, ఆ తర్వాత మొఘలుల పాలనలో షాజహాన్ దానిపై ఈ తాజ్ మహల్ ని 1632 నుంచి 1653 వరకు నిర్మించారని తెలుస్తుంది. ఓ చరిత్రకారుడు పీఎన్‌ ఓక్‌ రాసిన ట్రూ స్టోరీ ఆఫ్‌ తాజ్‌ అనే పుస్తకంతో ఈ వివాదం మొదలైంది. ఈ పుస్తకంలో తాజ్‌మహల్‌ కట్టడానికి పూర్వం అక్కడ ఓ శివాలయం ఉందని, తాజ్‌మహల్‌ ప్రధాన సమాధి కింద 22 రహస్య గదులు ఉన్నాయని తెలిపారు. అయితే 45 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ గదుల దగ్గరకు వెళ్లేందుకు ఓ మెట్లదారి తెరిచే ఉండేదని, కానీ ఆ తర్వాత దాన్ని మూసివేసి, అసలు ఎవరూ వెళ్లకుండా ఐరన్‌ డోర్స్‌తో పూర్తిగా క్లోజ్ చేశారని, భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ అప్పట్లో ఓ నివేదిక కూడా ఇచ్చింది.

అసలు దేనికి భద్రత? ఆ గదులని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లాగా అక్కడ కూడా నేల మాళిగలు ఏమైనా ఉన్నాయా? లేదా నిజంగానే హిందూ దేవాలయం ఉందా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తాజాగా అయోధ్య మీడియా ఇన్‌ఛార్జ్‌ రజనీష్‌ సింగ్‌ వేసిన పిటిషన్‌తో మరోసారి ఆ రహస్య గదులపై అందరి దృష్టి పడింది. ఈ పిటిషన్ లో తాజ్‌మహల్‌లోని మూసివేసిన 22 గదుల్లో ఏదో మిస్టరీ ఉంది. ఆ గదుల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు, గత చరిత్రకు సంబంధించి ఆధారాలు ఉండొచ్చు. అందుకే ఆ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయి. ఎటువంటి హాని జరగదు, ప్రజలకి నిజాలు తెలియాలి, దీనికి ఓ కమిటీ వేయాలి అని కూడా కోరారు. మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిలో తాజ్ మహల్ లోని ఆ 22 గదుల్లో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తి ఏర్పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి