iDreamPost

నేపాల్ సంచలనం.. ఏకంగా టీ20 వరల్డ్ కప్​లోకి..!

  • Author singhj Published - 03:10 PM, Fri - 3 November 23

క్రికెట్​లో పసికూన అయిన నేపాల్ సంచలనం సృష్టించింది. ఏకంగా వచ్చే టీ20 వరల్డ్ కప్​లోకి టీమ్ క్వాలిఫై అయింది. ఇది నేపాల్ క్రికెట్​ హిస్టరీలో మర్చిపోలేని రోజుగా చెప్పొచ్చు.

క్రికెట్​లో పసికూన అయిన నేపాల్ సంచలనం సృష్టించింది. ఏకంగా వచ్చే టీ20 వరల్డ్ కప్​లోకి టీమ్ క్వాలిఫై అయింది. ఇది నేపాల్ క్రికెట్​ హిస్టరీలో మర్చిపోలేని రోజుగా చెప్పొచ్చు.

  • Author singhj Published - 03:10 PM, Fri - 3 November 23
నేపాల్ సంచలనం.. ఏకంగా టీ20 వరల్డ్ కప్​లోకి..!

క్రికెట్ ఆడుతున్న ఏ ప్లేయర్​కైనా ఒకటే డ్రీమ్ ఉంటుంది. కెరీర్​లో ఒక్కసారైనా వరల్డ్ కప్​ను చేతపట్టాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. కానీ అదంత ఈజీ కాదు. డేంజరస్ టీమ్స్​ను దాటి, తీవ్ర ఒత్తిడిలోనూ క్వాలిటీ గేమ్ ఆడితే తప్ప వరల్డ్ కప్​ గెలవలేం. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ లెజెండ్​కు మెగా ట్రోఫీ నెగ్గాలనే ఆశ నెరవేరడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. కెరీర్ ఆఖర్లో వరల్డ్ కప్​ను ఒడిసిపట్టాడు సచిన్. పెద్ద టీమ్ ప్లేయర్లకు ప్రపంచ కప్పును ముద్దాడాలనే డ్రీమ్ ఉంటుంది. కానీ చిన్న టీమ్స్​కు, అందునా అసోసియేట్ కంట్రీస్​కు మెగా టోర్నీకి అర్హత సాధించడమే పెద్ద కలగా చెప్పొచ్చు.

వరల్డ్ కప్​లో ఆడాలనే డ్రీమ్​తో నిత్యం శ్రమిస్తుంటారు చిన్న దేశాల క్రికెటర్లు. తమకు దొరికిన ఛాన్సులను సద్వినియోగం చేసుకొని ఎప్పటికైనా వరల్డ్ కప్​కు టీమ్​ క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వరల్డ్ కప్ డ్రీమ్​ను పసికూన నేపాల్ నిజం చేసుకుంది. పొరుగు దేశం నేపాల్ సంచలనం సృష్టించింది. ఏకంగా టీ20 వరల్డ్ కప్-2024కు క్వాలిఫై అయి నయా హిస్టరీ క్రియేట్ చేసింది. క్రికెట్ అంటే పడిచచ్చే నేపాల్​కు ఇది గొప్ప విషయమనే చెప్పాలి. రీసెంట్​గా జరిగిన ఆసియా గేమ్స్​లోనూ ఆ టీమ్ సత్తా చాటిన విషయం తెలిసిందే.

పొట్టి ప్రపంచ కప్ కోసం నిర్వహించిన ఆసియా క్వాలిఫైయర్స్​లో నేపాల్ సత్తా చాటింది. సెమీఫైనల్​లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్​కు చేరుకుంది. దీంతో ఆ టీమ్ టీ20 వరల్డ్ కప్-2024కు అర్హత సాధించింది. నేపాల్​తో పాటు మరో పసికూన టీమ్ ఒమన్ కూడా వచ్చే ప్రపంచ కప్​కు క్వాలిఫై అయింది. సెమీస్​లో బహ్రెయిన్​ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఒమన్ చరిత్ర సృష్టించింది. నేపాల్​తో పాటు ఒమన్ దేశ క్రికెట్ హిస్టరీలో ఇది మర్చిపోలేని రోజుగా చెప్పొచ్చు. మరి.. టీ20 వరల్డ్ కప్-2024కు నేపాల్, ఒమన్ క్వాలిఫై కావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్‌ అంటే ఇంతా పిచ్చా?అభిమానానికి ఇంతకంటే నిదర్శనం ఉండదేమో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి