iDreamPost

T- Series : టి సిరీస్ – కొత్త ఫీల్డ్ లో గ్రాండ్ ఎంట్రీ

T- Series : టి సిరీస్ – కొత్త ఫీల్డ్ లో గ్రాండ్ ఎంట్రీ

కరోనా రాకపోయి ఉంటే ఓటిటి ఈ స్థాయిలో ఊపందుకునేది కాదేమో కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ ఆపలేనంత వేగంగా పరుగులు పెడుతోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఆర్టిస్టులు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా మ్యూజిక్ దిగ్గజ సంస్థ టి సిరీస్ కూడా స్వంతంగా ఓటిటిని ప్రారంభించబోతున్నట్టు ముంబై మీడియా అప్ డేట్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయట. వెబ్ సిరీస్ ల నిర్మాణానికి సంబంధించిన కథల ఎంపిక, దర్శకులు, క్యాస్టింగ్ తదితర పనులన్నీ చూసుకునేందుకు స్వంతంగా ఒక టీమ్ ని కూడా సెట్ చేస్తున్నట్టు సమాచారం.

లాంచ్ ఎప్పుడనేది అఫీషియల్ గా బయటికి చెప్పలేదు కానీ అతి త్వరలోనే ఉండొచ్చు. టి సిరీస్ 90 దశకంలో ఆడియో క్యాసెట్ల వ్యాపారంలో అడుగుపెట్టింది. మొదట్లో పైరసీ వివాదాలు చుట్టుముట్టినా తర్వాత అధినేత గుల్షన్ కుమార్ వ్యాపార తెలివితో కార్పొరేట్ సంస్థగా ఎదిగింది. స్వంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాలు నిర్మించడం కూడా మొదలుపెట్టింది. కోట్ల రూపాయల సంపాదనను ఓర్వలేకే మాఫియా అప్పట్లో గుల్షన్ కుమార్ ని పట్టపగలు హత్య చేయడం మీడియా ఎప్పటికీ మర్చిపోలేని సంచలనం. యుట్యూబ్ లో సైతం అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ గా టి సిరీసి అగ్ర సింహాసనం మీద ఉండటం విశేషం.

ఆల్రెడీ విపరీతమైన పోటీ ఉన్న డిజిటల్ స్పేస్ లో టి సిరీస్ ఎలా నెగ్గుకురాగలదనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ముందు నుంచీ ఈ సంస్థ స్ట్రాటజీలు పోటీదారులకు ఊహకందని విధంగా ఉంటాయి. హన్షల్ మెహతా, ఆనంద్ ఎల్ రాయ్, నిఖిల్ అద్వానీ, బెజోయ్ నంబియార్ లాంటి టాప్ ఫిలిం మేకర్స్ తో ఇప్పటికే ఒప్పందాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సోనీ లివ్, ఊట్, లయన్ గేట్స్ ప్లే, ఈరోస్, అల్ట్రా లాంటి ఓటిటిల మధ్య టి సిరీస్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి. ఇవి ఎన్ని వచ్చినా ఫైనల్ గా మంచి జరిగేది ఇండస్ట్రీకే. అవకాశాలు పెరుగుతాయి. క్వాలిటీ కోసం పోటీతత్వమూ ఎదుగుతుంది

Also Read : Mahaan : తండ్రీ కొడుకుల సినిమా యుద్ధం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి