iDreamPost

వీడియో: ఇది నెక్స్ట్ లెవల్ క్రికెట్.. ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు!

  • Published Feb 06, 2024 | 9:42 PMUpdated Feb 06, 2024 | 9:42 PM

గల్లీల్లో, గ్రౌండ్​లో క్రికెట్ ఆడటం చూస్తూనే ఉంటాం. ఖాళీ పొల్లాల్లో కూడా మ్యాచులు ఆడుతుంటారు. అయితే ఇది మాత్రం నెక్స్ట్ లెవల్ క్రికెట్ అనే చెప్పాలి. ఇలాంటిది మీరెప్పుడూ చూసి ఉండరు.

గల్లీల్లో, గ్రౌండ్​లో క్రికెట్ ఆడటం చూస్తూనే ఉంటాం. ఖాళీ పొల్లాల్లో కూడా మ్యాచులు ఆడుతుంటారు. అయితే ఇది మాత్రం నెక్స్ట్ లెవల్ క్రికెట్ అనే చెప్పాలి. ఇలాంటిది మీరెప్పుడూ చూసి ఉండరు.

  • Published Feb 06, 2024 | 9:42 PMUpdated Feb 06, 2024 | 9:42 PM
వీడియో: ఇది నెక్స్ట్ లెవల్ క్రికెట్.. ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు!

క్రికెట్ అంటే పడిచచ్చే దేశం మనది. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ జెంటిల్మన్ గేమ్​ను ఓ మతంగా, ప్లేయర్లను దేవుళ్లుగా భావిస్తుంటారు. క్రికెట్ అనేది మన దేశ ప్రజల జీవితంలో ఓ భాగంగా మారింది. ప్రతి ఒక్కరు తమ లైఫ్​లో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా క్రికెట్ ఆడే ఉంటారు. ఒక్కసారైనా బంతిని విసిరే ఉంటారు.. అలాగే బ్యాటును పట్టుకొని బాల్​ను గట్టిగా బాదే ఉంటారు. చిన్నతనంలో స్కూలులోనూ, ఆ తర్వాత కాలేజీలోనూ క్రికెట్ ఆడే ఉంటారు. అందుకే ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది వీకెండ్స్​లో గ్రౌండ్స్​లో మ్యాచులు పెట్టుకొని ఆడుతుంటారు. ఇక, గ్రామాల్లో ఉండే పిల్లలు, యువత తమకు దగ్గరల్లోని ఎండిపోయిన పొలాలు, మైదానాల్లో బ్యాట్లు పట్టుకొని దిగిపోతారు. రోజు మొత్తం క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. వీళ్లు కూడా ఇలాగే ఆడి ఓ వీడియో తీశారు. అయితే అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అయింది. అందులో అంత స్పెషాలిటీ ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాట్, బాల్, వికెట్లు ఉంటే చాలు క్రికెట్ ఆడేయొచ్చు. గల్లీలు, గ్రౌండ్స్​లో మ్యాచ్​లు ఆడటం కామనే. ఖాళీగా ఉండే వీధుల్లోనూ కొందరు క్రికెట్ ఆడుతుండటం చూసే ఉంటారు. అయితే కొందరు యువకులు మాత్రం డిఫరెంట్​గా ఆడారు. స్విమ్ క్రికెట్ అనే వైవిధ్యమైన కాన్సెప్టుతో నీళ్లలో క్రికెట్ ఆడారు. ఇందులో బౌలర్ బంతిని పరిగెత్తుకుంటూ వచ్చి వేశాడు. అది నీళ్లలో పడి బౌన్స్ అయి బ్యాటర్ వైపు దూసుకొచ్చింది. ఆ బాల్​ను ఆఫ్​ సైడ్ షాట్ కొట్టాడు బ్యాటర్. దీంతో గట్టు మీద ఉన్న ఫీల్డర్ నీళ్లలోకి దూకి ఈదుకుంటూ వెళ్లి బాల్​ను కీపర్​ వైపు త్రో చేశాడు. రన్ కోసం బ్యాట్స్​మన్, నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న ఇంకో బ్యాటర్ ఇద్దరూ నీళ్లలోకి దూకి ఈదుతూ వేరే ఎండ్​కు చేరుకున్నారు. కానీ ఆ లోపు త్రో వచ్చి వికెట్లను తాకడంతో బ్యాటర్ ఔటయ్యాడు.

స్విమ్ క్రికెట్ కాన్సెప్ట్​లో బౌలింగ్, బ్యాటింగ్​ చేసే ఎండ్స్​కు నడుమ నీటి ప్రవాహం ఉంది. అటు కీపర్, స్ట్రయికర్ ఒక గట్టులో ఉంటే.. బౌలర్, నాన్​స్ట్రయికర్, ఫీల్డర్లు మరో గట్టు మీద ఉన్నారు. రన్ తీయాలన్నా, త్రో వేయాలన్నా, క్యాచ్ పట్టాలన్నా అందరూ నీళ్లలోకి దూకి తీరాల్సిందే. త్వరగా ఈదడం మీదే పరుగులు తీయడం, ఔట్ చేయడం ఆధారపడి ఉంటుంది. ఇది ఎక్కడ, ఎవరు ఆడారో లాంటి వివరాలేవీ తెలియదు. కానీ కాన్సెప్ట్‌ కొత్తగా ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని.. దీన్ని ప్రయత్నించాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈదడం వల్ల ఫిట్​నెస్ పెరుగుతుందని.. డిఫరెంట్ క్రికెట్ ఆడామనే ఫీలింగ్ కూడా కలుగుతుందని చెబుతున్నారు. మరి.. స్విమ్ క్రికెట్ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి