iDreamPost

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..బడులల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ నిర్ణయాలు తీసుకుంటాయి. పరిపాలనలో, ప్రజా సంక్షేమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా సూర్య నమస్కారాలు పాఠశాలల్లో తప్పనిసరిగా చేయాలంటూ ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ నిర్ణయాలు తీసుకుంటాయి. పరిపాలనలో, ప్రజా సంక్షేమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా సూర్య నమస్కారాలు పాఠశాలల్లో తప్పనిసరిగా చేయాలంటూ ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..బడులల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి!

సూర్య నమస్కారాలు.. ఈ పేరు మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలానే  వీటిని చేయడం ద్వారా మానసికి ప్రశాంత, కుటుంబ పరిస్థితులు కూడా చాలా  సంతోషంగా ఉంటాయని పలువురు ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇక విద్యార్థులు కూడా ఈ సూర్య నమస్కారాలు ఆచరించడం ద్వారా మానసి ఉల్లాసం, ఆరోగ్య ప్రయోజానాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే సూర్య నమస్కారాల విషయంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. వారు ఏ నిర్ణయాలు తీసుకున్న అతిమ లక్ష్యం ప్రజల కోసం అనేది అందరికి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే  విద్యావ్యవస్థ, వైద్య రంగంలో ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను కూడా ప్రవేశ పెడుతుంటాయి. అంతేకాక కొన్ని ప్రభుత్వాలు అయితే మన పూర్వం నుంచి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే సంప్రదాయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

రాజస్థాన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసింది. ఆ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రతి రోజూ వీటిని చేయాలని ఉత్తర్వూలు జారీ చేసింది. పాఠశాలల్లో ఉదయం ప్రార్థనల తర్వాత ప్రతి రోజూ విద్యార్థులందరూ సూర్య నమష్కారాలు చేయలని సూచించింది. ఈ మేరకు సూర్య నమస్కారాలు చేయాలంటు ఆ రాష్ట్ర విద్యా శాఖమంత్రి మదన్ దిలావర్ ప్రకటించారు. రోజూ సూర్యోదయం సమయంలో 10 నుంచి 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని మంత్రి అభిప్రాయ పడ్డారు.

మదన్ దిలావర్ ఇటీవలే అయోధ్య రామమందిర విషయంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో అయోధ్య మందిర నిర్మాణం జరిగే వరకు పూల దండలు వేసుకోనని శపథం చేశారు. ఆ రామయ్య మందిరం నిర్మాణం పూర్తైన తరువాత మరో ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసింది. మథుర లో శ్రీకృష్ణాలయం నిర్మాణం జరిగే వరకు తాను ఒక్కపూటే భోజనం చేస్తానని ఆయన తెలిపారు. ఇటీవలే రాజస్థాన్ లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో  మదన్ దిలావర్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరి.. తాజాగా రాజస్థాన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి అంటూ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి