iDreamPost

Etharkum Thunindhavan : సూర్య చేస్తున్న రిస్కు పెద్దదే

Etharkum Thunindhavan : సూర్య చేస్తున్న రిస్కు పెద్దదే

వచ్చే నెల 10న కాబోతున్న సూర్య కొత్త సినిమా ఈటి టీజర్ తెలుగు ప్రేక్షకులకు బాగానే రీచ్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత తను మంచి మాస్ అవతారంలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా మార్కెట్ బాగా తగ్గిపోయిన సూర్య ఒకరకంగా ఆ రిలీజ్ డేట్ తో రిస్క్ చేస్తున్నారు. 11న అంటే కేవలం ఒక్క రోజు గ్యాప్ తో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వస్తుంది. ఈటి కూడా వివిధ భాషల్లో డబ్బింగ్ చేసినప్పటికీ ప్రభాస్ సినిమాతో సమానంగా చూడలేం కాబట్టి ఈ పోలిక కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఏపి తెలంగాణలో అధిక శాతం థియేటర్లు రాధే శ్యామ్ వైపే మొగ్గు చూపిస్తాయి.

ఇంత తెలిసి సూర్య ధైర్యం చేయడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. రాధే శ్యామ్ క్లాసీగా సాగే యూరోప్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. నార్త్ ఆడియన్స్ తో పాటు ఇలాంటి వాటిని ప్రత్యేకంగా ఇష్టపడే మూవీ లవర్స్ ని ఆకట్టుకోవచ్చు. కానీ బిసి సెంటర్ మాస్ జనాన్ని మెప్పించేంత బలమైన కంటెంట్ ఉందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ తమిళనాడులో ఈటివైపే ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు మొగ్గు చూపుతారు. గత కొన్ని నెలలుగా ఈ స్థాయిలో చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమా ఏదీ రాలేదు. వలిమై తర్వాత నెక్స్ట్ బిగ్ టార్గెట్ ఈటినే అవుతుంది. సో ఇక్కడ ఆడినా ఆడకపోయినా సూర్య నిర్మాతలు స్పష్టంగా వాళ్ళ లోకల్ మార్కెట్ నే టార్గెట్ చేసుకున్నారు.

దర్శకుడు పాండిరాజ్ కు ఇక్కడ పెద్ద ఇమేజ్ ఏమి లేదు. ఆయన తీసిన కార్తీ చినబాబుకు మనవాళ్ళు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. సో ఈటి గురించి కూడా ముందస్తుగా ఒక అంచనాకు రాలేం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కు పెద్దన్న ఫేమ్ ఇమ్మాన్ సంగీతం అందించారు. రెండు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ తర్వాత చేసిన సినిమా కావడంతో సూర్య దీని మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. స్వయంగా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు కూడా. మరి రాధే శ్యామ్ ని తట్టుకుని ఈటి ఎలా నిలబడుతుందో చూడాలి మరి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. చూడాలి మరి

Also Read : Radhe Shyam : ప్రభాస్ మూవీకి ఊహించని చిక్కులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి