iDreamPost

కృష్ణ రీమేక్ సినిమాల విశేషాలు..

కృష్ణ రీమేక్ సినిమాల విశేషాలు..

ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను రీమేక్ చేయడం ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చిన ట్రెండ్ కాదు. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వాటిని మార్చుకుని తీయగలిగితే హిట్లు సాధించవచ్చని కృష్ణ హీరోగా రూపొందిన ఎన్నో చిత్రాలు ఋజువు చేశాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం. 1967లో వచ్చిన ‘మరపురాని కథ’ మొదటిది. ఇది తమిళ కై కొడుత్త దైవంకు తెలుగు రూపకం. అక్కడ శివాజీగణేశన్ సావిత్రి చేశారు. 1968లో రిలీజైన ‘మంచి కుటుంబం’ మూవీ మోటార్ సుందరం పిళ్ళై నుంచి తీసుకున్నది. సుప్రసిద్ధ బాలీవుడ్ రాజ్ కపూర్ ఆనాడిని ‘అమాయకుడు’గా మార్చారు దర్శకులు నారాయణరావు. కన్నడ మూవీ దుడ్డె దొడ్డప్ప ఇక్కడ ‘లక్ష్మి నివాసం’ అయ్యింది. అరవ సూపర్ హిట్ నాన్ ని ‘నేనంటే నేను’గా మారిస్తే తెలుగులోనూ మంచి విజయం అందుకుంది.

Superstar Krishna: 'సూపర్ స్టార్ కృష్ణ' సాధించిన ఘనతలు ఇవే.. కృష్ణా సరిలేరు నీకెవ్వరు - OK Telugu

ఉండమ్మా బొట్టుపెడతా(మరాఠి కథ), చెల్లెలి కోసం(తంగై), భలే అబ్బాయిలు(వక్త్), శభాష్ సత్యం(మిస్టర్ ఎక్స్), ఆస్తులు అంతస్తులు( పణమా పాశమా), అన్నదమ్ములు(మురప్పేన్), కర్పూర హారతి(కర్పూరం), బందిపోటు భీమన్న(చక్రమ్), అక్కాచెల్లెలు(అక్కా తంగై), మళ్ళీ పెళ్లి(జీవనాంశం), పెళ్లి కూతురు(లక్ష్మి కళ్యాణం), మా మంచి అక్కయ్య(ఉద్యోగస్థ), అగ్ని పరీక్ష(ముత్తు చిప్పి), నేనూ మనిషినే(దో భాయ్), గూడుపుఠాణి(అపరాద్), కోడలు పిల్ల(శపథం), శ్రీవారు మావారు(ఉల్లాసయనం), పుట్టినిల్లు మెట్టినిల్లు(పుగుంద వీడు) ఇవన్నీ అధిక శాతం తమిళం హిందీ నుంచి హక్కులు కొన్న రీమేకులే. ఫ్యామిలీ ఆడియెన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టినవి.

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఈ అరుదైన రికార్డు.. భవిష్యత్తులో మరెవరికీ సాధ్యం కాదేమే.. | Super Star Krishna Unique Record In Tollywood Film Industry Here Are The Details– News18 ...

ఇవే కాదు పలు హాలీవుడ్ మూవీస్ నుంచి కూడా కృష్ణ స్ఫూర్తి చెంది కథలు రాయించి అద్భుత విజయాలు అందుకునేవారు. ‘మోసగాళ్లకు మోసగాడు’కి మూలం మెకనస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అండ్ ఆగ్లీలే. ‘సింహాసనం’ అనుకున్నప్పుడు ఆయన మనసులో మెదిలింది బెన్ హర్, క్లియోపాత్రా లాంటి క్లాసిక్స్ అని సన్నిహితులు చెబుతుంటారు. శోభన్ బాబు ‘మానవుడు దానవుడు’ని బాగా ఇష్టపడి అదే టైటిల్ తో అలాంటి కథతో ఓ మూవీ చేశారు కృష్ణ. 1975 కన్నా ముందు ఏడాదికి పది సినిమాలు చేయాల్సిన పరిస్థితిలో అవి స్ట్రెయిటా రీమేకా అని ఏదీ ఆలోచించుకునే టైం ఉండేది కాదు. అందుకే మూడు వందల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటి హీరోలకు ఇది సాధ్యమేనా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి