iDreamPost

రోహిత్ శర్మ కెప్టెన్సీ బాలేదు! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 12:30 PM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 12:30 PM, Mon - 10 July 23
రోహిత్ శర్మ కెప్టెన్సీ బాలేదు! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..

‘గతంలో టీమిండియాలోని ఆటగాళ్లంతా ఫ్రెండ్స్ లా ఉండే వాళ్లం, కానీ ఇప్పుడు కేవలం ఆఫీస్ లో కొలిగ్స్ లా ఉంటున్నాం’ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి కొన్ని రోజుల క్రితం టీమిండియా వెంటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఇవి. అప్పట్లో ఈ కామెంట్స్ టీమిండియా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. టీమ్ సభ్యుల మధ్య ప్రేమాభిమానులు లోపించడం చాలా బాధాకరమని, జట్టు రాణించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు గవాస్కర్.

2023 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అలాగే టీమిండియా ఆటగాళ్ల తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా జట్టు వైఫల్యాల గురించి, రోహిత్ శర్మ కెప్టెన్సీ పై అలాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి గవాస్కర్ మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో సునీల్ గావాస్కర్ మాట్లాడుతూ..”కెప్టెన్సీ విషయంలో నేను రోహిత్ శర్మ నుంచి చాలా ఎక్కువగా ఆశించాను. విదేశీ గడ్డలపై రోహిత్ శర్మ కెప్టెన్సీ అంత బాలేదు. అది నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. స్వదేశంలో గెలవడం అంత కష్టం కాదు. కానీ విదేశాల్లో గెలిస్తేనే మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ఇక ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. టీమిండియా ఫైనల్స్ కు చేరడంలో విఫలం అవుతోంది. టీ20 టోర్నీల్లో కూడా భారత్ పరిస్థితి ఇలాగే ఉంది” అని సునీల్ గవాస్కర్ విమర్శించాడు.

ఇక అశ్విన్ కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ పై కూడా గవాస్కర్ స్పందించాడు. మ్యాచ్ ముగియగానే ఆటగాళ్లందరు ఒకటోట కూర్చుని మాట్లాడుకోవాలని గవాస్కర్ సూచించాడు. అయితే డ్రెస్సింగ్ రూంలో ఒక్క క్రికెట్ గురించే కాక.. సినిమాలు, పాటల గురించి కూడా మాట్లాడుకోవాలన్నాడు. గత కొంత కాలంగా జట్టులో ప్రతీ ప్లేయర్ కు సింగిల్ గా గదిని కేటాయిస్తున్నారని, ప్లేయర్స్ మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే వరల్డ్ కప్ దగ్గర పడుతుండటంతో.. ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించాలని సెలక్టర్లకు, బీసీసీఐ అధికారులకు సూచించాడు. డ్రెస్సింగ్ రూంలో ఇలాంటి వాతావరణం పెట్టుకుని వరల్డ్ గెలవడం కత్తిమీద సాముగా వర్ణిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి