iDreamPost

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ముందుగానే వేసవి సెలవులు.. ఈసారి భారీగా!

స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ సారి వేసవి సెలవులు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈసారి భారీగా ఎండాకాలం సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ సారి వేసవి సెలవులు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈసారి భారీగా ఎండాకాలం సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ముందుగానే వేసవి సెలవులు.. ఈసారి భారీగా!

ఎండాకాలం రానే వచ్చింది. భానుడు భగభగ ఎండలు కురిపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. వేసవిలో ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్ కు వెళ్లే విద్యార్థులపై ఎండ ప్రభావం పడనున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈ సారి వేసవి సెలవులు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మునుపటికంటే ఈసారి భారీగా ఎండాకాలం సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఒక్కపూట బడులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కూల్స్‌కు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎండలు పెరుగుతున్న వేళ తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆరు బయట తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో తాగునీటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. ఏపీలో ఈ ఏడాదికి సంబంధించిన వేసవి సెలవులు ఏప్రిల్ 24 2024 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా జూన్ 13 2024 తేదీ వ‌రకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

ఈసారి దాదాపు 50 రోజులు పాటు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. కాగా వేసవి సెలవులపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. వేసవి సెలవులు భారీగా రానుండడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్చి 18 నుంచి ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మార్చి 30వ తేదీ వరకు జరుగనున్నాయి.

summer holidays for schools

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి