iDreamPost

హైదరాబాద్‌లో అకస్మాత్తు వర్షం.. మూడు కార్లు ధ్వంసం.. పలువురికి గాయాలు..

హైదరాబాద్‌లో అకస్మాత్తు వర్షం.. మూడు కార్లు ధ్వంసం.. పలువురికి గాయాలు..

ఒకపక్కన ఎండాకాలం అని ఎండలు మండిపోతున్నాయి. మరో పక్కన సడెన్ గా తుఫానులంటూ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే తుఫానుతో మండే ఎండల్లో భీభత్సమైన వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ(మే 26) ఉదయం నుంచి హైదరాబాద్ లో ఎండ ఎక్కువగానే ఉంది. ఇక మధ్యాహ్నం ఎండ దంచి కొట్టింది. కానీ సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చినుకులు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది.

అయితే భారీగా ఈదురుగాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో ఉన్న నిర్మాణం జరుగుతున్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరి పడి అటుగా వెళ్తున్న వాహనాలపై, మనుషులపై పడ్డాయి. దీంతో నాంపల్లిలో 3 కార్లు ధ్వంసం కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక రాష్ట్రంలో రానున్న మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి