iDreamPost

Stop Raping Us కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో షాకింగ్ ఘటన

Stop Raping Us కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో షాకింగ్ ఘటన

Cannes red carpet కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అంద‌రూ రెడ్ కార్పెట్ హ‌డావిడిలో ఉన్న‌స‌మ‌యంలో అర్ధ నగ్నంగా ఉక్రెయిన్ మ‌హిళ‌ నిరసన వ్యక్తం చెయ్యడం కలకలం రేపింది. సెక్యూరిటీ అలెర్ట్ అయ్యి, ఆమెను పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ దేశంపై ర‌ష్యా యుద్ధాన్ని నిరసిస్తూ ప్రొటెస్ట్ చేసింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివిధ దేశాలకు చెందిన నటీ నటులు రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే, ఆ గ్లామ‌ర్ ను కవర్ చేయడానికి ఫొటో, వీడియో గ్రాఫర్ లు పోటీ పడుతున్నారు. కొంతమంది రెడ్ కార్పెట్ పై నడుస్తుండగా, ఓ మహిళ వచ్చి తన ఒంటిపై ఉన్న దుస్తులను తీసేసింది. ఉక్రెయిన్ లో రష్యా సైనికులు చేస్తోన్న అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్ జెండాలు ఉండడంతో ఆమెది ఆ దేశ‌మేన‌ని అనుకొంటున్నారు. అంతే, ఒక్కసారిగ అలజాడి. భద్రత సిబ్బంది అప్రమత్తమై ఆమెపై దుస్తులు కప్పి అక్కుడుంచి తీసుకెళ్లారు.

మరోవైపు… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, లైవ్ శాటిలైట్ వీడియో ద్వారా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడారు. తమ దేశంపై రష్యా సైనికులు అరాచ‌కాలు సాగిస్తున్నార‌ని నిందించారు. తమ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఎందుకు ఉంటోంద‌ని ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి