iDreamPost

Pooja Hegde ల‌గేజీ పోగొట్టుకున్న పూజా హెగ్డే, మ‌రి రెడ్ కార్పెట్ పైకి ఎలా వెళ్ల‌గ‌లిగింది?

Pooja Hegde ల‌గేజీ పోగొట్టుకున్న పూజా హెగ్డే, మ‌రి రెడ్ కార్పెట్ పైకి ఎలా వెళ్ల‌గ‌లిగింది?

కేన్స్ ఫిల్మ్ ఫిస్ట‌వ‌ల్ రెడ్ కార్పెట్ మీద ఇండియ‌న్ స్టాంప్ ప‌డింది. దీపికా, ఐశ్వ‌ర్య‌లాంటి ఎవ‌ర్ గ్రీన్ స్టార్లు రెడ్ కార్పెట్ మీద న‌డిచినా, పూజా హెగ్డే మాత్రం త‌న స్టైల్ ను చూపించింది. కేన్స్ కెళ్ల‌డం పూజాకు తొలిసారి. ఎన్నో ప్లాన్లు వేసుకున్నా, త‌న డిజైన‌ర్ డ్రెస్ తోపాటు, ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ కిట్ పోగొట్టుకుంది. రెడ్ కార్పెట్ న‌డిచిన త‌ర్వాత అస‌లు ఏం జ‌రిగిందో ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ఎయిర్ ట్రావెల్ కి రెండు బ్యాగ్ ల‌ను ఒప్పుకోలేదు. అందుకే ఒక‌దాన్ని ఇండియాలోనే వ‌దిలేసిందంట‌. అంటే ఒక్క బ్యాగ్ తోనే ఫ్రాన్స్ కి బ‌య‌లుదేరింది. ఈ జ‌ర్నీలో ఉన్న‌ది కాస్తా పోయింది. అందులోనే ఆమె డిజైన‌ర్ డ్రెస్, మేక‌ప్ కిట్, హెయిర్ ప్రొడెక్ట్స్ అన్నీ ఉన్నాయి. రెడ్ కార్పెట్ వాక్ కు కౌంట్ డౌన్ మొద‌లైంది. ఆమె అస‌లు డ్రెస్ లేదు. అందుకే లోక‌ల్ గా డ్రెస్ ను ఆమె టీం కొనుగోలు చేసింది. మేక‌ప్ కిట్ తోపాటు, హెయిర్ ప్రొడ‌క్ట్స్ కూడా అక్క‌డే కొన్నారు. ల‌క్కీ ఏంటంటే, ఆమె జ్యూవెల‌రీ మాత్రం ఆమె హ్యాండ్ బ్యాగ్ లోనే ఉంది. ముందు టెన్ష‌న్ ప‌డిన పూజా, కార్పెట్ పై మెరిసిన త‌ర్వాత‌నే కాస్త రిలాక్స్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి