iDreamPost

రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చల్లో విష ప్రయోగం జరిగిందా..?

రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చల్లో విష ప్రయోగం జరిగిందా..?

ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి, ఇప్పటికే ఉక్రెయిన్ ప్రతిదాడులతో చావుదెబ్బ తింటున్న రష్యా సైనికులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఉక్రెయిన్ ప్రత్యేక ఆపరేషన్ ముగిసేవరకు వెనక్కి తగ్గమని రష్యా అంటోంది. రెండు వారాల నుంచి ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదే సమయంలో శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల మీద విషప్రయోగం జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదిక విడుదల చెయ్యడం కలకలం రేపింది.

ఉక్రెయిన్ లోని కీవ్ లో జరిగిన శాంతి చర్చల సమావేశంలో ఈ విషప్రయోగం జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో తెలిపింది. శాంతి చర్చలు జరిగిన తరువాత రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల కళ్లు ఎర్రబడి నీరు ఎక్కువగా కారిందని, శరీరం మీద దద్దులు వచ్చాయని, అందరూ స్వల్ప అనారోగ్యానికి గురైనారని, అయితే సరైన సమయంలో చికిత్స అందించడం వలన వారు కోలుకుంటున్నారని, వారి ప్రాణాలకు ఎలాంటి హానీలేదని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదికలో తెలిపింది.

కీవ్ లో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వారి మీద విష ప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఉక్రెయిన్ అధికారులు కొట్టిపారేశారు. అయితే శాంతిచర్చల్లో పాల్గొన్న వారి మీద విషప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల విషయంలో రష్యా ఇంతవరకు నోరు విప్పలేదు. ఉక్రెయిన్ మీద పదేపదే ఆరోపణలు చేస్తున్న రష్యా ఇప్పుడు కీవ్ లో విషప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల విషయంలో సైలెంట్ గా ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రముఖుల మీద విషప్రయోగం జరిగిందని వార్తలు ఇప్పుడు ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఉక్రెయిన్ ప్రత్యేక ఆపరేషన్ ముగిసేవరకు వెనక్కి తగ్గమని రష్యా అంటోంది. రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సైనికులు, ఆ దేశంలోని కొందరు ప్రజలు పోరాటం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి