iDreamPost

అల్సర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సమస్యకు చెక్‌

  • Published Nov 15, 2023 | 1:39 PMUpdated Nov 15, 2023 | 1:39 PM

అల్సర్‌.. ఈ సమస్య బారిన పడ్డామంటే.. ఇక ఏం తినాలన్నా సరే భయపడాల్సి వస్తుంది. తింటే ఒక బాధ.. తినకపోతే మరో సమస్య. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ వివరాలు..

అల్సర్‌.. ఈ సమస్య బారిన పడ్డామంటే.. ఇక ఏం తినాలన్నా సరే భయపడాల్సి వస్తుంది. తింటే ఒక బాధ.. తినకపోతే మరో సమస్య. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ వివరాలు..

  • Published Nov 15, 2023 | 1:39 PMUpdated Nov 15, 2023 | 1:39 PM
అల్సర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సమస్యకు చెక్‌

మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా.. చిన్న వయసులోనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇక నేటి కాలంలో చాలా మందిని పట్టి పీడిస్తోన్న అతి సామాన్యమైన సమస్య గ్యాస్ట్రిక్‌ అల్సర్‌. ఒక్కసారి దీని బారిన పడ్డామంటే.. ఏం తినాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఏ ఆహారం తీసుకుంటే.. కడుపులో మంటగా ఉంటుందో తెలియక.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే.. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో యాసిడ్‌ అవసరం. జీర్ణవ్యవస్థలో ఈ యాసిడ్‌ ఎక్కువైనా, తక్కువైనా అల్సర్లు తయారవుతాయి. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. 80 శాతం మందిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల అల్సర్లు వస్తాయి అంటున్నారు నిపుణులు.

కారణాలు..

  • హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణంగా కడుపులో పుండ్లు ఏర్పడతాయి.
  • అలానే సమయానికి తినకపోవడం వల్ల కూడా అల్సర్‌ బారిన పడే అవకాశం ఉంది.
  • కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
  • మద్యం, స్మోకింగ్‌ అలవాట్ల వల్ల అల్సర్‌ వచ్చే అవకాశం ఉంది.
  • ఇవే కాక మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల కూడా అల్సర్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

అల్సర్‌ సమస్యకు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం..

అల్సర్‌ సమస్యని ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలు అల్సర్‌ని సూచిస్తాయి. ఈ సమస్యలన్నిటికీ చిన్న చిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఆ చిట్కాలు ఏంటి అంటే..

  • శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, ఉసిరికాయ, తెలుపు సైంధవ లవణం పొడి చేసి భోజనం చేశాక మజ్జిగతో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. అయితే ఇక్కడ చెప్పిన పదార్థాల్లో మిరియాలను తక్కువ పరిమాణంలో.. మిగిలిన వాటిని సమాన భాగాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఒక గ్లాస్‌ వెన్న తీసిన మజ్జిగలో ఇనుప గరిట వేడి చేసి ముంచి అందులో ఒక టీస్పూన్‌ చక్కెర, కొద్దిగా జీలకర్ర, అల్లం కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పరగడుపునే తాగాల్సి ఉంటుంది.
  • సైంధవ లవణం, వెల్లుల్లి రసం, ఇంగువలను బాగా కలిపి కొద్ది మోతాదులో తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి, మంట తగ్గుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
  • మారేడు గుజ్జు, బెల్లంను సమానంగా కలిపి చిన్న ఉసిరికాయంత సైజులో మాత్రలా చేసుకుని మజ్జిగతో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపునొప్పి తగ్గుతుంది అంటున్నారు.
  • గంజి నీటిని అర గ్లాసు మోతాదులో తీసుకుని అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి కలిపి తాగాలి. దీనివల్ల కడుపులో ఉండే పుండ్లు తగ్గుతాయంటున్నారు.
  • వాల్‌ నట్స్, దానిమ్మ పండ్లు, వెలగ పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

పైన చెప్పిన చిట్కాలను పాటిస్తూ.. కొన్ని రోజుల పాటు కారం వస్తువులు, మసాలాలు, జున్ను, మినపపప్పు, పెరుగు, పుల్లని పదార్థాలను తినడం మానేశాయి. మజ్జిగ, వేయించి వండిన మెత్తని అన్నం, పెసరకట్టు, దానిమ్మ రసం, బెల్లం, పాలు వంటివి మేలు చేస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి